మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకే నెలలో వరుస మూవీ షూటింగ్స్‌తో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య (Acharya) సినిమాను పూర్తిచేశారు చిరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలతోపాటు.. చిరు ఇప్పుడ గాడ్ ఫాదర్ (God Father), భోళా శంకర్ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు చిరంజీవి. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్.
అయితే గత కొద్దిరోజులుగా చిరంజీవి సినిమాలో మాస్ మాహారాజా కీలకపాత్రలో నటించబోతున్నాడంటూ ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ బాబీ, చిరు కాంబోలో రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ మెగాస్టార్ తమ్ముడిగా నటించనున్నాడట. ఈ మూవీలో రవితేజ పాత్ర సుమారు 40 నిమిషాలు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే దాదాపు 22 ఏళ్ల తర్వత చిరు, రవితేజ అన్నదమ్ముల పాత్రలో నటించనున్నారు. 2000 సంవత్సరంలో చిరంజీవి, సౌందర్య జంటగా నటించిన చిత్రం అన్నయ్య. ఈ మూవీలో చిరు తమ్ముల్లుగా రవితేజ, వెంకట్ నటించి అలరించారు. వైజాగ్ షిప్ యార్డ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి అండర్ కవర్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇందులో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది.
Also Read: Pooja Hegde: బుట్టబొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హతో ఆసక్తికరమైన వీడియో..
Teaser Talk: అసలు మనిషి చర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హన్సిక కొత్త సినిమా టీజర్..
Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు
Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..