Ram Charan: రామ్ చరణ్ సిగ్నెచర్ ఎలా ఉంటుందో చూశారా ?.. మెగా పవర్ స్టార్ స్టైల్ అంటే మాములుగా ఉండదు మరీ..
తాజాగా చరణ్.. ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో కలిసి వచ్చాడు చరణ్. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే వేదకపై సందడి చేశారు .

ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జపాన్లో సందడి చేశారు చెర్రీ. అనంతరం సతీమణి ఉపాసనతో కలిసి ఆఫ్రికన్ అడవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మిడియాలో తెగ వైరలయ్యాయి. ఇక ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన చరణ్.. ప్రస్తుతం తన తదుపరి సినిమా ఆర్సీ 15 చిత్రీకరణలో పాల్గొనేందుకు వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా చరణ్.. ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో కలిసి వచ్చాడు చరణ్. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే వేదకపై సందడి చేశారు . బాలీవుడ్.. టాలీవుడ్ పాటలకు తమ స్టైల్లో స్టెప్పులేసి అలరించారు. ఇక అనంతరం తమ కోసం వచ్చిన అభిమానులను కలుసుకున్నారు.
పలువురు అభిమానులకు సెల్ఫీలు.. ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఈ క్రమంలోనే ఓ అభిమానికి చెర్రీ ఇచ్చిన సిగ్నేచర్ నెట్టింట వైరలవుతుంది. హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న చరణ్ ను మిస్ ఇండియా రన్నరప్ రుషాలి రాయ్ కలిసింది. చెర్రీతో ఫోటో తీసుకుని.. ఆటోగ్రాఫ్ తీసుకుని తెగ మురిసిపోయింది. అనంతరం తన అభిమాన హీరోతో కలిసి దిగిన ఫోటోలను .. ఆటోగ్రాఫ్ ను రుషాలి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందులో చరణ్. ఆల్ ది బెస్ట్ రుషాలి అని చెబుతూ సిగ్నేచర్ పెట్టాడు. ఇక చెర్రీ సిగ్నేచర్ ఫస్ట్ టైమ్ బయటకు రావడంతో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.





Cha Ran
ప్రస్తుతం చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా.. హీరోయిన్ అంజలి కీలకపాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
