AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇంటింటి’ సుమ సంపాదన ఎంత..?

యాంకర్ సుమ.. ఈమె తెలియని వారుండరు. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు మంచి పేరుంది. ఏ టాప్‌ హీరో.. సినిమా రిలీజ్ ఫంక్షన్ అయినా.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయినా ఈమె తప్పక ఉండాల్సిందే. కాగా.. బాహుబలి సినిమా రిలీజ్ టైంలో.. రాజమౌళి.. సుమని బంధించి.. మా ఆడియో ఫంక్షన్‌కి నీ డేట్స్ ఫిక్స్ చేయాలి.. లేదంటే నిన్ను జైలులోనే ఉంచుతా.. అంటూ.. సరదాగా సంభాషించిన విషయం గుర్తుందా..! అంతాలా టాలీవుడ్‌లో.. ఆమె మంచి పేరు తెచ్చుకుంది. […]

'ఇంటింటి' సుమ సంపాదన ఎంత..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 12, 2019 | 11:42 AM

Share

యాంకర్ సుమ.. ఈమె తెలియని వారుండరు. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు మంచి పేరుంది. ఏ టాప్‌ హీరో.. సినిమా రిలీజ్ ఫంక్షన్ అయినా.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయినా ఈమె తప్పక ఉండాల్సిందే. కాగా.. బాహుబలి సినిమా రిలీజ్ టైంలో.. రాజమౌళి.. సుమని బంధించి.. మా ఆడియో ఫంక్షన్‌కి నీ డేట్స్ ఫిక్స్ చేయాలి.. లేదంటే నిన్ను జైలులోనే ఉంచుతా.. అంటూ.. సరదాగా సంభాషించిన విషయం గుర్తుందా..! అంతాలా టాలీవుడ్‌లో.. ఆమె మంచి పేరు తెచ్చుకుంది.

సుమ మలయాళీ అయినా.. చిన్నప్పటి నుంచీ ఇక్కడే ఉండటంతో.. ఆమెకు తెలుగు భాషపై పట్టు వచ్చింది. అయితే.. ఇప్పుడు సుమ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. ఆమెపై.. తన భర్త రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే వీటి గురించి.. రాజీవ్ పలు సార్లు చెప్పినా.. తాజాగా జరిగిన ఇంటర్య్వూలో సుమ గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో.. ఇవి మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి.

‘అసలు సుమ అన్ని షోలు చేస్తుంది కదా.. తెగ సంపాదించేస్తుంది అనుకుంటున్నారేమో.. తనకు వచ్చేది తక్కువేనని.. ఇన్ని సంవత్సరాలుగా.. షూటింగ్‌లో పెద్ద పెద్ద లైట్స్ మధ్య కష్టపడుతూ వచ్చిందని చెప్పుకొచ్చారు. అలాగే.. తన వెనుక నేను ఉన్నానని అనుకుంటారు. కానీ.. నిజానికి అందంతా ఆమె టాలెంటే.. నేను సలహాలు మాత్రమే ఇస్తాను తప్ప.. క్రెడిట్స్ తీసుకోనని చెప్పాడు రాజీవ్ కనకాల. అలాగే.. మరో విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ.. తన రెమ్యునరేషన్ ఎంతో కూడా తనకు తెలీదని.. మేము అసలు వాటి గురించి ఇంట్లో ప్రస్తావించమని చెప్పుకొచ్చాడు. సుమకు ఇవ్వాల్సిన స్పేస్ ఇచ్చేస్తానని.. ఇతర వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోనని’ రాజీవ్ తెలిపాడు.

తాజాగా.. గ్లామర్ షోలతో ఎంత మంది యాంకర్స్ వచ్చినా.. బుల్లితెరపై యాంకర్లలో లేడీ సూపర్ స్టార్ మాత్రం సుమ ఒకరే అని చెప్పాలి. గత 20 ఏళ్లుగా తెలుగులో బుల్లితెర యాంకర్‌గా తన స్థాయికి మించిన పేరు, గుర్తింపు తెచ్చుకున్న సుమా.. ఇప్పటివరకూ కొన్ని వేల షోలకి యాంకర్‌గా చేసింది. అలాగే.. ఇండియాలోనే ఏ యాంకర్ చేయలేనటువంటి షోలకి వ్యాఖ్యాతగా చేసి ‘గిన్నీస్ బుక్‌’లో సైతం సుమ చోటు సంపాదించుకుంది.

Follow Us