Shivani Rajashekar: ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రాజశేఖర్ కూతురు.. సోషల్ మీడియాలో శివాని రచ్చ..

శివాని రాజశేఖర్ (Shviani Rajashekar).. టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్.. సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Shivani Rajashekar: ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రాజశేఖర్ కూతురు.. సోషల్ మీడియాలో శివాని రచ్చ..
Shivani

Updated on: Apr 18, 2022 | 7:02 PM

శివాని రాజశేఖర్ (Shviani Rajashekar).. టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్.. సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నటనపరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన అద్భుతం సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది. ఇందులో శివాని నటకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కేవలం టాలీవుడ్‏లోనే కాకుండా.. కోలీవుడ్‏లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ హీరోయిన్‏గా మారిపోయింది. కేవలం శివాని మాత్రమే కాకుండా.. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక సైతం ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక.. శివాని, శివాత్మిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ.. తమ మూవీ అప్డేట్స్.. ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంటారు. తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఆస్తికకర విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంది.

శివాని రాజశేఖర్ ఇప్పుడు ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల్లో ఎంపికైంది. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల్లో 8వ అభ్యర్థిగా ఎంపికైంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ఖాతా ద్వారా అధికారికంగా తెలియజేసింది. శివాని షేర్ చేసిన పోస్టుకు నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఇదో కొత్త ప్రయాణం.. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలంటూ శివానీ షేర్ చేసిన పోస్ట్ పై హీరోయిన్ ఈషారెబ్బా, శివాత్మిక రియాక్ట్ అయ్యారు. అలాగే.. నెటిజన్స్ శివానికి ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Acharya: భలే భలే బంజారా సాంగ్ వచ్చేసింది.. చిరంజీవి, రామ్ చరణ్ మాస్ స్టెప్పులు అదుర్స్..

Nikhil: పాన్ ఇండియా మార్కెట్ పై కన్నెసిన యంగ్ హీరో.. నిఖిల్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?..

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్..

Nani Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి స్పెషల్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్..