Viral Photo: ఈ బుడ్డోడు ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోన్న ఇండియన్ సీఈఓ.. ఎవరో గుర్తుపట్టారా!
ఈ మధ్య హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ తమకు ఇష్టమైన నటీనటుల..
ఈ మధ్య హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ తమకు ఇష్టమైన నటీనటుల చైల్డ్‌హుడ్ పిక్స్ ఇంటర్నెట్‌లో కనిపిస్తే చాలు.. దెబ్బకు వైరల్ చేసి పడేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
పైన ఫోటోలో కనిపిస్తోన్న ఈ బుడ్డోడు ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. ఇటీవల రిలీజైన తన కొత్త సినిమాతో బాలీవుడ్ కోటలను బద్దలు కొట్టడమే కాదు.. రికార్డులను తొక్కుకుంటూ పోతున్నాడు. సౌత్ ఇండియా సినిమా సత్తా ఏంటో హిందీ ఇండస్ట్రీకి రుచి చూపించాడు. ‘నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు.. నాతో దుష్మణి ఎవ్వడూ తట్టుకోలేడు’ అంటూ ఇండియన్ సినిమాలో తనకంటూ సెపరేట్ పేజీని లిఖించుకున్నాడు. కింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్న ఈ హీరో ఇప్పుడు ఇండియాలో పరిచయం అక్కర్లేని నటుడు.. ఈపాటికి అతడెవరో మీకు అర్ధమై ఉంటుంది.
ఎవరో కాదు మన ‘రాకీభాయ్’. కేజీఎఫ్ స్టార్ యశ్. కన్నడ హీరో యశ్.. 2018లో కేజీఎఫ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అన్ని భాషల్లోనూ.. రికార్డులు కొల్లగొట్టి పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా నిలిచాడు. ఇక ఇప్పుడు మరోసారి కేజీఎఫ్ చాప్టర్ 2తో వచ్చి.. బ్రేకుల్లేని బుల్డోజర్‌లా రికార్డులను తొక్కుకుంటూ పోతున్నాడు. ‘పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేస్స్ మోర్ పవర్ ఫుల్’ అంటూ రాకీ భాయ్ 4 రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు.
View this post on Instagram