AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya: భలే భలే బంజారా సాంగ్ వచ్చేసింది.. చిరంజీవి, రామ్ చరణ్ మాస్ స్టెప్పులు అదుర్స్..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆచార్య (Acharya).

Acharya: భలే భలే బంజారా సాంగ్ వచ్చేసింది..  చిరంజీవి, రామ్ చరణ్ మాస్ స్టెప్పులు అదుర్స్..
Acharya
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2022 | 5:26 PM

Share

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆచార్య (Acharya). మాస్ డైరెక్టర్ కొరటాల శివ తరెకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పంచ్‌ డైలాగులతో పవర్‌ ఫుల్ కిక్కులతో ట్రైలర్ లో విరుచుకుపడిన చిరు.. చూసి ఫిదా అవుతున్నారు టూ స్టేట్స్‌ ఫిల్మీ లవర్స్. ఇక తాజాగా ఈ సినిమా నుంచి భలే భలే బంజారా పాటను విడుదల చేసింది చిత్రయూనిట్.

తాజాగా విడుదలైన సాంగ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ పోటీ పడి చేసిన మాస్ స్టెప్పులకు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా తనయుడితోపాటు.. ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా చిరు వేసిన స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా.. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: F3 Movie: ఎఫ్ 3 నుంచి సెకండ్ సింగిల్ వచ్చేది అప్పుడే.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్..

Nani Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి స్పెషల్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్..

Samantha: ఆ ఆలోచనే మానుకోండి.. నెటిజన్లకు ఊహించని షాకిచ్చిన సమంత..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!