Rajasekhar: జీవిత కంటే ముందు ఆ హీరోయిన్‌ నుంచి పెళ్లి ప్రపోజల్ .. కానీ.. ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన రాజశేఖర్

సీనియర్ హీరో, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ బిజీ అవుతున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ మూవీలో కనిపించిన రాజశేఖర్ లేటెస్ట్ గా బైకర్ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించారు.

Rajasekhar: జీవిత కంటే ముందు ఆ హీరోయిన్‌ నుంచి పెళ్లి ప్రపోజల్ .. కానీ.. ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన రాజశేఖర్
Actor Rajasekhar

Updated on: May 05, 2026 | 1:07 PM

మొన్నటి వరకు హీరోగా మాత్రమే సినిమాలు తీసిన రాజశేఖర్‌ ఇప్పుడు సహాయక నటుడిగానూ రాణిస్తున్నారు. యంగ్‌ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్యన నితిన్ ‘ఎక్స్ ట్రార్డినరి మ్యాన్’ మూవీలో కనిపించిన రాజశేఖర్ లేటెస్ట్ గా బైకర్ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించారు. శర్వానంద్ తండ్రి సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీల్ పాత్రలో అద్బుతంగా నటించారు. కొన్ని సీన్లలో అయితే తన యాక్టింగ్ తో కన్నీళ్లు తెప్పించారు యాంగ్రీమ్యాన్. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో రాబోయే రోజుల్లో రాజశేఖర్ మరింత బిజీ కావొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు రాజశేఖర్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పుడవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

కాగా రాజశేఖర్, జీవితలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్లు గా నటించిన వీరు ప్రేమికులుగా మారారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే జీవిత కంటే ముందు శ్రీదేవితో తనకు పెళ్లి ప్రపోజల్‌ వచ్చిందని రాజశేఖర్‌ అంగీకరించారు. శ్రీదేవి తండ్రికి, మా నాన్నగారికి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ చొరవతో ఇరువైపులా స్నేహితుల మధ్య పెళ్లి ప్రపోజల్ వచ్చిన మాట నిజమే. మా కులం కూడా ఒకటే. దూరపు బంధువులు అవుతారు. అందుకే శ్రీదేవి ఫ్యామిలీ నుంచి నాకు పెళ్లి ప్రపోజల్‌ వచ్చింది. అప్పటికీ నేను ఇంకా సినిమాల్లోకి రాలేదు. ఎంఎస్‌ చదవాలనుకుంటున్నాను. ఇదే విషయాన్ని మా నాన్న వాళ్లకు చెప్పి వారి ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేశారు. సినిమాల్లో నటించేవాళ్లను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదు. అందుకే శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్‌ని పక్కన పెట్టారు. అయితే శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేరు. అందుకే ఈ విషయం గురించి మనం మాట్లాడడం సరికాదు. అందుకే ఎక్కడా ఈ విషయం గురించి చెప్పను’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇద్దరు కూతుళ్లతో జీవిత- రాజశేఖర్ దంపతులు..

బైకర్ సినిమా ప్రమోషన్లలో రాజశేఖర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us