AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prudhvi Raj: ట్విట్టర్ ఖాతా తెరచిన నటుడు పృథ్వీరాజ్.. మొదటి పోస్ట్ ఏం పెట్టాడో తెలుసా?

టాలీవుడ్ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ఈ మధ్యన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ తో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Prudhvi Raj: ట్విట్టర్ ఖాతా తెరచిన నటుడు పృథ్వీరాజ్.. మొదటి పోస్ట్ ఏం పెట్టాడో తెలుసా?
Prudhvi Raj
Basha Shek
|

Updated on: Feb 22, 2025 | 12:36 PM

Share

టాలీవుడ్ ప్రముఖ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయన వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన గొర్రెల కామెంట్స్ ఎంత రచ్చ రాజేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించే పృథ్వీ కామెంట్స్ చేశాడంటూ ట్విట్టర్ లో ఏకంగా బాయ్ కాట్ లైలా ట్రెండ్ అయ్యింది. విశ్వక్సేన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. కారణాలేమైనా లైలా మూవీ దారుణంగా ఫెయిల్ అయింది. ఆ తర్వాత పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఈ వివాదం చల్లబడుతుండగానే మరోసారి వార్తల్లోకి వచ్చాడు పృథ్వీ రాజ్. ‘నేను ట్విట్టర్ (ఎక్స్) లోకి వచ్చేశా’ అంటూ ఈ రోజు ఉదయం ట్విట్టర్ అకౌంట్ క్రియోట్ చేసి అందరికి హాయ్ చెప్పాడు. దీంతో అప్పటి నుంచి ఆ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

” హయ్ .. నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్. ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. నేను నా భావాలను స్టేజ్ పైనా ప్రకటిస్తుంటే కొద్ది మంది ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు నుండి ఈ ట్విట్టర్ అనే వేదిక ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్చ ని తెలియపరుస్తాను.. థాంక్యూ’ అంటూ మొదటి పోస్ట్ లో రాసుకొచ్చాడు పృథ్వీ రాజ్. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. సార్ ఇప్పుడు ఇది అవసరమంటారా? అని కొందరంటుంటే..’ తగ్గేదెలా ఇక మీరు రెచ్చిపోండి’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా తన ట్విట్టర్ ఫ్రొఫైల్ కు తన ఫొటోనే పెట్టిన పృథ్వీ.. కవర్ ఫొటోకు మాత్రం మెగా ఫ్యామిలీ ఫొటో ఎంచుకున్నారు.  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు కలిసున్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతా కవర్ ఫొటోగా పెట్టుకున్నాడు.

పృథ్వీ రాజ్ షేర్ చేసిన మొదటి పోస్ట్ ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి