సీని నటుడు పృథ్వీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనే పేరుతో ఈయన చాలా పాపులర్ అయ్యారు. సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకునే పృధ్వీ రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. నిన్నటివరకు జగనన్న పార్టీ జండా మోసిన పృథ్వీ.. ఇప్పుడు పార్టీ మారారు. జనసేనకు జై కొట్టాడు పృథ్వీ. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈసదర్భంగా పృథ్వీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడుతూ.. జనసేనతో మొన్నే నిశ్చితార్థం అయింది అన్నారు.
త్వరలోనే జనసేన పార్టీలో చేరుతున్నా అని క్లారిటీఇచ్చారు పృథ్వీ. అధికారం ఉన్నా, లేకపోయినా…పవన్ కల్యాణ్ పేదలకు దగ్గరగా ఉంటారని ఆయన అన్నారు. అలాగే పవనే మా నాయుకుడు, సినిమా పెద్ద అని చెప్పుకొచ్చారు. ఇక వైసీపీకి మంగళం పాడేశాను. ఆ దరిద్రం అయిపోయింది, ఇక పట్టించుకోను. కరోనా వస్తే నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు అని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక త్వరలో జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. గతంలో వైసీపీలో ఉన్న పృథ్వీ పై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే కాదు పృథ్వీకు విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా 8 లక్షల రూపాయలు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అతని నుంచి భరణం ఇప్పించాలని ఆయన భార్య 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షలు రూపాయలు, ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇవ్వాలని ఆదేశించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.