AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godfather: థియేటర్స్‌లో దుమ్మురేపుతోన్న గాడ్ ఫాదర్.. ఓటీటీ స్ట్రీమింగ్ అందులోనేనా..

మెగాస్టార్ నటించిన లాస్ట్ మూవీ ఆచార్య సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దాంతో ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగాఫ్యాన్స్

Godfather: థియేటర్స్‌లో దుమ్మురేపుతోన్న గాడ్ ఫాదర్.. ఓటీటీ స్ట్రీమింగ్ అందులోనేనా..
God Father
Rajeev Rayala
|

Updated on: Oct 06, 2022 | 5:14 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ గా సందడి చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు. మెగాస్టార్ నటించిన లాస్ట్ మూవీ ఆచార్య సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దాంతో ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగాఫ్యాన్స్. అంచనాలకు తగ్గట్టుగా గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కించారు మోహన్ రాజా. భారీ అంచనాల మధ్య గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు ఇది రీమేక్. అయినా చాలా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కించారు మోహన్ రాజా. ఎన్వీ ప్రసాద్ – ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. అంతే కాదు చిరు, సల్మాన్ కలిసి ఓ పాటలో స్టెప్పులు కూడా వేశారు.

అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార చిరంజీవి సిస్టర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో సునీల్, సత్యదేవ్, అనసూయ ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుండగా..  ఆ తర్వాత ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుందని ఓ టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

థియేటర్స్ అనంతరం గాడ్ ఫాదర్ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది త్వరలోనే తెలియనుంది. ఈ సినిమాతర్వాత.. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లోనూ చిరు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం