Prabhas: న్యూలుక్‍లో సర్ ప్రైజ్ చేసిన డార్లింగ్.. డ్రగ్స్‏కు వ్యతిరేకంగా ప్రభాస్ ప్రచారం..

|

Dec 31, 2024 | 4:10 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తనవంతు బాధ్యతగా సందేశాన్ని ఇస్తూ వీడియోనూ షేర్ చేశారు.

Prabhas: న్యూలుక్‍లో సర్ ప్రైజ్ చేసిన డార్లింగ్.. డ్రగ్స్‏కు వ్యతిరేకంగా ప్రభాస్ ప్రచారం..
Prabhas
Follow us on

ఈ ఏడాది కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. తాజాగా డ్రగ్స్‏కు వ్యతిరేకంగా ప్రచారం చూస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు డార్లింగ్. తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తనవంతు బాధ్యతగా ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

ప్రభాస్ ప్రచారం..
‘లైఫ్‏లో మనకు బోలెడన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు మన కోసం ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్స్.. డ్రగ్స్ కు నో చెప్పండి. మీకు తెలిసినవాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే ఈ రోజే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు ప్రభాస్.

ఇక ఈ వీడియోలో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుంది. కల్కి సినిమాకు కాస్ విభిన్నంగా కనిపిస్తున్నారు డార్లింగ్. పూర్తిగా సన్నబడి స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రీకరణలో ఉన్నారు డార్లింగ్. అలాగే అటు డైరెక్టర్ హను రాఘవపూడి మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

 

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.