దర్శకుడికి కులాభిమానం ఎక్కువ అంటూ ప్రచారం.. రంగంలోకి దిగిన నితిన్

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజాగా చిత్రం మాచర్ల నియోజక వర్గం. ఈ సినిమా పై నితిన్ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల నితిన్ చేస్తున్న సినిమాలు ఆకట్టుకోకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నరు అభిమానులు.

దర్శకుడికి కులాభిమానం ఎక్కువ అంటూ ప్రచారం.. రంగంలోకి దిగిన నితిన్
Nithin
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 27, 2022 | 11:06 AM

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజాగా చిత్రం మాచర్ల నియోజక వర్గం(Macherla Niyojakavargam). ఈ సినిమా పై నితిన్ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల నితిన్ చేస్తున్న సినిమాలు ఆకట్టుకోకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నరు అభిమానులు. దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా పై క్యురియాసిటీని పెంచుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే సినిమా విడుదల కాక ముందే దర్శకుడిపై నెగిటివ్ దాడి మొదలైంది.

ఎంఎస్ఆర్.శేఖర్ మొదటి సినిమా మాచర్ల నియోజకవర్గం. సినిమా విడుదలకు ముందే దర్శకుడిపై దాడి మొదలైంది. ఎస్ఆర్ శేఖర్ అసలు పేరు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయనకు కులాభిమానం ఎక్కువ అంటూ ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని కులాలను తిడుతూ.. ఆయన పేరుతో ఓ ఫేక్ ఐడి తో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే తనకు కులాభిమానం ఎక్కువ అంటూ జరుగుతోన్న ప్రచారంను తిప్పికొట్టారు శేఖర్. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ లు క్రియేట్ చేశారని అలాంటీబీ పోస్ట్ లు నమ్మొద్దు అని రిక్వస్ట్ చేశారు. తన దర్శకుడికి మద్దతుగా నిలిచారు హీరో నితిన్. “ఒక ఫేక్ వ్యక్తి చేసిన ఫేక్ ట్వీట్ అనవసరమైన రచ్చ సృష్టించింది.. దురదృష్టవశాత్తు ఇది ఇతరుల మనోభావాలను దెబ్బతీసింది.. ఇది  చాలా విచారకరం .ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను” అంటూ నితిన్ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి