Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ మరింత వెనక్కి వెళ్లనుందా..? పవన్ సినిమాకు మరో బ్రేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. మొన్నామధ్య సినిమాలకు చిన్న గ్యాప్ తీసుకున్న పవన్ ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమా తో తిరిగి ఫామ్ లోకి వచ్చారు.

Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' మరింత వెనక్కి వెళ్లనుందా..?  పవన్ సినిమాకు మరో బ్రేక్
Pawan Kalyan
Follow us

|

Updated on: Jul 27, 2022 | 10:18 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. మొన్నామధ్య సినిమాలకు చిన్న గ్యాప్ తీసుకున్న పవన్ ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమా తో తిరిగి ఫామ్ లోకి వచ్చారు. రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ చేసిన రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. వకీల్ సాబ్ తర్వాత చేసిన బీమ్లానాయక్ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది.అయితే పవన్ లైనప్ చేసిన సినిమాల్లో క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. పవన్ కెరీర్ లో వస్తోన్న హై బడ్జెట్ మూవీ ఇది. మొగలాయిలా కాలం నాటి కథతో క్రిష్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని టాక్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ వాయిదాల మీద  వాయిదాలు పడుతూ వస్తుంది.

తాజాగా మరోసారి ఈ సినిమాకు బ్రేక్ పడింది . ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా 65 శాతం పూర్తయ్యింది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గ్లిడ్ ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు మరోసారి హరిహర వీరమల్లు షూటింగ్ కు బ్రేక్ పడనుంది. అటు పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. వరుసగా రెండు హిట్లు కొట్టిన పవన్ ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారని పవన్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రొడ్యూసర్ గ్లిడ్ నిర్ణయంతో పవన్ అభిమానులు కాస్త నిరాశపడక తప్పడంలేదు. పవన్ సినిమా ప్రేక్షకుల ముందుకు మరింత సమయం పట్టేలా ఉంది. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్ వస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే