Nikhil Siddhartha: మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు! స్పందించిన టాలీవుడ్ హీరో

మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఎట్టకేలకు నిఖిల్ ఈ వ్యవహారంపై స్పందించాడు.

Nikhil Siddhartha: మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు! స్పందించిన టాలీవుడ్ హీరో
Nikhil Siddhartha

Updated on: Feb 08, 2025 | 9:09 AM

మస్తాన్ సాయి.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలోనూ ఇతని గురించే చర్చ నడుస్తోంది. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మస్తాన్ సాయి మీద కేసు పెట్టంది. అదే సందర్భంలో అతనికి సంబంధించిన ఒక హార్డ్ డిస్క్‌‌ను పోలీసులకు అందజేసింది. ఈ హార్డ్ డిస్క్ లో దాదాపుగా 200 వరకు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, న్యూడ్ వీడియోలు, ఆడియో కాల్స్ ఉన్నట్లుగా పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయని తెలిపింది. దీంతో ఈ విషయంపై గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై హీరో నిఖిల్ స్పందించాడు. తనపై జరుగుతున్నది అసత్య ప్రచారమంటూ ఖండించాడు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఉన్న వీడియోలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని నిఖిల్ వాపోయాడు.

నా కుటుంబ సభ్యులతోనే..

‘ కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత డిన్నర్ పార్టీ జరిగింది. ఆ వీడియోలనే ఇప్పుడు తప్పుగా చూపిస్తున్నారు. అందులో కూడా ఉన్నది మా కుటుంబ సభ్యులే. పోలీసులకు కూడా వాస్తవం ఏంటనే విషయం తెలుసు’ అని నిఖిల్ స్పష్టం చేశాడు. కాగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దాదాపుగా 200 వరకు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు లావణ్య తెలిపింది. డ్రగ్స్ ఇచ్చి లావణ్యతో పాటు పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీసిన మస్తాన్ సాయి ఎంతోమందిని బెదిరించినట్లు తెలిపింది. చాలామంది దగ్గర డబ్బులు తీసుకునేవాడని, తర్వాత వారి ముందు డిలీట్ చేసినట్టు నటించేవాడని , అయితే అంతకుముందే వాటిని పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకునేవాడని తెలుస్తోంది. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే లైంగికంగా వాడుకుంటూ అప్పుడు కూడా రహస్యంగా వీడియోలు తీసేవాడని మస్తాన్ సాయిపై ఆరోపణలున్నాయి.

ఇవి కూడా చదవండి

స్వయంభు సినిమా సెట్ లో హీరో నిఖిల్ సిద్ధార్థ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.