AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddhartha: మీరు గ్రేట్ సార్.. గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. ఏకంగా 1000 మంది స్కూల్ పిల్లలకు..

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సుమారు రెండేళ్లు అవుతోంది. అయితే ఈ లోటును పూడ్చేలా 'స్వయంభు' అంటూ ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుతో ఆడియెన్స్ మన ముందుకు రానున్నాడు నిఖిల్.

Nikhil Siddhartha: మీరు గ్రేట్ సార్.. గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. ఏకంగా 1000 మంది స్కూల్ పిల్లలకు..
Nikhil Siddhartha
Basha Shek
|

Updated on: Jul 07, 2026 | 6:53 PM

Share

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నాడు. సామాజిక స్పృహ మెండుగా ఉన్న ఈ హీరో తాజాగా తాజాగా 1000 మంది స్కూల్ పిల్లలకు అవసరమైన స్టడీ మెటీరియల్, బుక్స్ కిట్ అందిచాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో ఈ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హీరో నిఖిల్ స్వయంగా వెళ్లి విద్యార్థులకు స్డడీ మెటీరియల్ అందించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అఖిల్.. ‘ఒక నటుడిగా స్క్రీన్ మీదే కాదు.. సొసైటీకి ఏదో ఒకటి రిటర్న్ ఇవ్వాలని నా ప్రయత్నం. అందులో భాగంగానే 1వ తరగతి నుంచి 5వ తరగతి ఎలిమెంట్రీ స్కూల్ పిల్లలకు ఆల్మోస్ట్ ఒక 1000 మంది పిల్లలకు ఈ రోజు స్టేషనరీ కిట్స్, చదువుకోవడానికి కావాల్సిన ఒక గిఫ్ట్ యాంపర్స్ ఇచ్చాం. ఇంతకు ముందు ఇలాంటి కార్యక్రమాలు కేవలం హైదరాబాద్‌లో చేసే వాడిని.. ఇప్పుడు అన్నీ ప్రాంతాల్లో చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశాం. ప్రతి సంవత్సరం కూడా పబ్లిసిటీ లేకుండానే ఇలాంటి పనులు చేసేవాడిని. అయితే నాకు అర్థం అయింది ఏంటంటే.. నేను చాలా మందిని చూసి ఇన్స్‌పెయిర్ అయ్యా. అలాగే నన్ను చూసి కూడా ఎంతోకొంత మంది ఇన్ స్పైర్ అవుతారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.

విద్యార్థులతో కలిసి హీరో నిఖిల్ దిగిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు నిఖిల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్వయంభు అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. సంయుక్తా మీనన్, నభా నటేష్ ఈ సినిమాలో కథానాయికలుగా కనిపించనున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘కె.జి.యఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో హీరో నిఖిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us