
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ ముగిసింది. శనివారం (సెప్టెంబర్ 24) సుమారు 6 గంటల పాటు ఈ విచారణ సాగింది. ఈ సందర్భంగా డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆధారాలను నవదీప్ ముందు ఉంచారు నార్కోటిక్ అధికారులు. అలాగే మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు నార్కోటిక్ పోలీసులు. నవదీప్‌ను రకరకాల ప్రశ్నలతో నార్కోటిక్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు నవదీప్ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. డ్రగ్స్ సప్లయర్‌తో రామచందర్‌తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఒప్పుకున్న నవదీప్.. అమ్మతోడు డ్రగ్స్‌తో మాత్రం సంబంధం లేదంటున్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వాళ్లంతా నా స్నేహితులే కానీ.. డ్రగ్స్ దందాతో సంబంధం లేదంటూ అమాయక ఫేస్ పెట్టాట్ట నవదీప్. మీడియాలో చూసేవరకు వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారనే విషయం కూడా తెలియదని నవదీప్ అత్యంత అమాయకంగా చెప్పాడట. ఇక విచారణ అనంతరం బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడారు. ‘డ్రగ్స్ తీసుకోవడం ఎప్పుడో మానేశానని ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. విచారణలో భాగంగా నార్కోటిక్ అధికారులు అడిగి ప్రశ్నలన్నింటికీ క్లియర్‌గా సమాధానం చెప్పాను. నిందుతుడు రామ్‌చందర్‌తో నాకు నాలుగేళ్ల క్రితం నుంచే పరిచయం ఉంది. పాన్ ఇండియా లెవెట్‌లో నార్కొటిక్ టీమ్ అధికారులు బాగా పనిచేస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఫోన్ రికార్డులను గురించి కూడా అడుగుతున్నారు. అధికారులు అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. ఒకవేళ అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారు.’ అని చెప్పారు నవదీప్.
కాగా ఇటీవల మాదాపూర్ పోలీసులు నిర్వహించిన రైడ్‌లో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హీరో నవదీప్‌ను డ్రగ్ కన్జ్యూమర్‌గా గుర్తించారు.. పోలీసుల ఆపరేషన్‌లో పట్టుబడిన రాంచందర్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంతో నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు రాంచందర్ తెలిపారు. దీంతో నార్కోటిక్ అధికారులు నవదీప్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. అయితే ఈ కేసుకు తనకు సంబంధం లేదంటూ హైకోర్టును ఆశ్రయించాడు హీరో. తనను అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. దీంతో 19వ తేదీ వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు విచారణలో భాగంగా నవదీప్ ఇంట్లో సోదాలు జరిపారు నార్కోటిక్ అధికారులు. అలాగే 41 A కింద నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు పిలిచారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.