
ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఎప్పుడూ ఉండే చర్చే. సౌత్ లో కాకుండా.. బాలీవుడ్ లో వారసత్వం అనేది ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. స్టార్ హీరోహీరోయిన్స్ అనేకసార్లు దీనిపై ఎన్నో విమర్శలు.. ట్రోలింగ్స్ ఎదుర్కొన్నవారే. ఇప్పటికీ పలువురు యంగ్ స్టార్స్ ఈ నెపోటిజం కామెంట్స్ ఎదురవుతుంటాయి. తాజాగా దీని గురించి న్యాచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రముఖ సింగర్ స్మిత హోస్ట్ ఓటీటీ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతున్న నిజం విత్ స్మిత టాక్ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని తన వ్యక్తిగత జీవితం.. సినీ ప్రయాణం గురించి వెల్లడించారు. ఇప్పుడు నాని.. రానా కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నెపొటిజం గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
నాని మాట్లాడుతూ.. “నా ఫస్ట్ మూవీ లక్ష మంది చూశారను. కానీ రామ్ చరణ్ తొలి చిత్రాన్ని కోటి మంది చూశారు. అలా చూసిన వాళ్లు కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోంది ..! ” అని అన్నారు. అలాగే ఇదే విషయం రానా మాట్లాడుతూ.. “తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యత పిల్లలపై ఉంటుంది. వారికి మరో గొప్ప స్థాయికి తీసుకెళ్లాలి. అప్పుడే పిల్లలు విజయం సాధించినట్లు.. అలా చేయకపోతే వాళ్లు అన్ని వైపుల నుంచి రకరకాల మటాలు పడాల్సి వస్తుంది” అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇంకా ఇదే విషయమై వారిద్దరూ పూర్తిగా ఏం మాట్లాడారో తెలియాలంటే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 24న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక నాని.. కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.