మురళీ మోహన్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడిగా ఫేమస్.. హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన మురళీ మోహన్ తన సినీ ప్రయాణాన్ని 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో మురళీ మోహన్ వెండితెరపై అడుగు పెట్టారు. 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన తిరుపతి సినిమాతో మురళీ మోహన్ కు మంచి నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 350సినిమాల్లో నటించారు.
టాలీవుడ్ లో అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీ మోహన్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనను వెండి తెరకు పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు, పీవీ సుబ్బారావుగార్లకు కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు తాను మొదట్లో 15 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటె చాలు అనుకునేవాడిని.. అయితే అందరూ తనను ఎంతో బాగా చూసుకునేవారని.. అందరి సహకారంతో 50 ఏళ్లు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నానని చెప్పారు.
కొన్ని పరిస్థితుల వలన రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చిందని.. అందుకే సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు చెప్పారు. ఇక నుంచి పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారిస్తానని.. తాను అక్కినేని నాగేశ్వరావు చెప్పిన మాటను ఆదర్శంగా తీసుకుని తాను మరణించే వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు మురళీ మోహన్.
మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. 1940, జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. టాలీవుడ్ నటుడు, నిర్మాత. జయభేరి గ్రూపు అధిపతి, రాజకీయ నేత గా తనకంటూ ఓ ప్లేన్ సొంతం చేసుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ‘మిథునం’ చిత్ర సంగీత దర్శకుడు వీణాపాణి రాసిన ‘అమ్మే దైవం’ పాట వీడియోను రిలీజ్ చేశారు మురళీమోహన్.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..