Suriya: హీరో మాధవన్‌ను చూసి నోరెళ్లబెట్టిన సూర్య.. దండం పెట్టేసిన హీరో.. నెట్టింట వీడియో వైరల్..
రాకెట్రీ చిత్రీకరణ చూసేందుకు నంబి నారాయణన్‌తో కలిసి షూటింగ్ చూసేందుకు వచ్చారు హీరో సూర్య.
చాలా కాలం తర్వాత హీరో మాధవన్ (Madhavan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం రాకెట్రీ.. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో హీరో మాదవన్ నటిస్తుండగా.. ఈ సినిమాకు దర్శకత్వం కూడా ఆయనే వహిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్లో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. రాకెట్రీ చిత్రీకరణ చూసేందుకు నంబి నారాయణన్‌తో కలిసి షూటింగ్ చూసేందుకు వచ్చారు హీరో సూర్య.
ఈ క్రమంలోనే సెట్ లో నంబి నారాయణన్ గెటప్ లో ఉన్న మాదవన్ ను చూసి ఒక్కసారిగా షాకయ్యారు.. ఇది కలా ? నిజమా అన్నట్లుగా నోరెళ్లబెట్టి.. చూస్తూ ఉండిపోయారు.. అయితే సూర్య, నంబి నారాయణన్ ఇరువురు రాగానే కుర్చీలో నుంచి లేచి ఇద్దరికీ స్వాగతం పలికారు మాదవన్. ఆ తర్వాత తన స్నేహితుడు సూర్యను నంబి నారాయణన్ కు పరిచంయం చేశారు.. సూర్య నటన తనకు చాలా ఇష్టమని.. అలాగే అతని తండ్రి శివకుమార్ దర్శకత్వం చాలా నచ్చుతుందంటూ చెప్పుకొచ్చారు నంబి నారాయణన్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో సూర్య ఓ కీలకపాత్రలో నటిస్తుండగా. నంబి నారాయణన్ భార్య పాత్రలో సిమ్రాన్ నటిస్తోంది… ఈ చిత్రాన్ని జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.