Kiran Abbavaram: సొంతింటి కలను నిజం చేసుకున్న యంగ్ హీరో.. కిరణ్ అబ్బవం డ్రీమ్ హౌస్ చూశారా ?..
ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఆ తర్వా సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ చిత్రాలతో అలరించాడు. ఇప్పుడు రూల్స్ రంజన్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

రాజావారు రాణిగారు సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. తర్వాత కిరణ్ నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు కిరణ్. ఇక ఈసినిమా హిట్ కావడంతో కిరణ్తో మరిన్ని మూవీస్ చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపించారు. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఆ తర్వా సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ చిత్రాలతో అలరించాడు. ఇప్పుడు రూల్స్ రంజన్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. కిరణ్ అబ్బవరం తన సొంతింటి కలను నిజం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాలో పంచుకున్నారు. అయితే కిరణ్ ఆ ఇంటిని తన సొంత ఊరు కడప జిల్లా రాయచోటిలోనే నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిరణ్ షేర్ చేసిన నెట్టింట వైరలవుతుండగా.. అభిమానులు, సెలబ్రెటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమాల్లోకి రాకముందు కిరణ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవారు. నటనపై ఆసక్తితో జాబ్ వదిలి సినిమాల్లోకి అడుగుపెట్టారు.
View this post on Instagram
ముందుగా సినిమాల్లోకి రావాలనుకున్న సమయంలో ఎంతో మంది తనను విమర్శించారని.. సినీ పరిశ్రమలో ఎలగైనా నిలదొక్కుకోవాలనిపించిందని.. దీంతో వరుస సినిమాలు చేసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాలుగేళ్లలో దాదాపు ఏడు సినిమాలు చేశానని.. అందులో కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కిరణ్ నటించిన చిత్రం రూల్స్ రంజన్.. త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
View this post on Instagram
ఈ సినిమాలో కిరణ్ జోడిగా డిజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి కథానాయికగా నటించగా.. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. గతంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సమ్మోహనుడా సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. చాలా కాలంగా వరుస ప్లాపులతో నెట్టుకోస్తున్న కిరణ్ ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయంగా తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




