Kalyan Ram: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కళ్యాణ్ రామ్.. ట్వీట్ వైరల్..

|

Jan 28, 2023 | 5:01 PM

తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హీరో నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. ఆయన తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేసారు.

Kalyan Ram: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కళ్యాణ్ రామ్.. ట్వీట్ వైరల్..
Kalyan Ram, Tarak Ratna
Follow us on

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉన్నట్లు నారాయణ హృదలయ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయనను పది మంది వైద్యుల బృందం దగ్గరుండి పర్యవేక్షిస్తుందని.. ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని అన్నారు. అయితే ఆయన ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉండడంతో అటు కుటుంబసభ్యులు.. అభిమానులు.. టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హీరో నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. ఆయన తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేసారు.

“నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను .” అంటూ ట్వీట్ చేశారు కళ్యాణ్ రామ్. దీంతో తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.. మరోవైపు.. తారకరత్న హెల్త్ కండిషన్ దృష్ట్యా రేపు సాయంత్రం విడుదల కావాల్సిన ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ పాటను వాయిదా వేశారు కళ్యాణ్ రామ్. ఆయన నటిస్తోన్న అమిగోస్ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సాంగ్ ప్రోమో నిన్న విడుదల చేసారు. ఇక ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ పాట రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం తారకరత్నకు బెంగుళూరులోని నారాయణ హృదలయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిన్నటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ. మరోవైపు ఎప్పటికప్పుడు తారకరత్న హెల్డ్ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు చంద్రబాబు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.