Kalyan Ram: కళ్యాణ్ రామ్ కూతురు.. తనయుడిని ఎప్పుడైనా చూశారా ?.. నెట్టింట నందమూరి హీరో ఫ్యామిలీ పిక్..
అతనొక్కడే, అభిమన్యు, పటాస్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన కళ్యాణ్.. ప్రస్తుతం బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

లక్ష్మీ కళ్యాణం సినిమాతో చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేశారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram). మొదటి సినిమాతోనే తన నటన పరంగా ప్రశంసలు అందుకున్నారు ఈ హీరో. నందమూరి హరికృష్ణ వారసుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయకులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. అతనొక్కడే, అభిమన్యు, పటాస్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన కళ్యాణ్.. ప్రస్తుతం బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రియాడికల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకు డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహిస్తుండగా.. తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ పిక్ తెగ చక్కర్లు కొడుతుంది. అందులో కళ్యాణ్ రామ్.. ఆయన సతీమణి స్వాతి, కుమార్తె తారక అద్వైత, కుమారుడు సౌర్య రామ్ ఉన్నారు. నిజానికి కళ్యాణ్ రామ్ తన వ్యక్తిగత విషయాలు.. ఫ్యామిలీ ఫోటోస్ ఎక్కువగా బయటకు రానివ్వడానికి ఆసక్తి చూపించరు.





Kalyan Ram Family Pic
కళ్యాణ్ రామ్ కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇటీవల జూలై 5న కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు కావడంతో తన కుటుంబంతో కలిసి సెలబ్రెషన్స్ జరుపుకున్నారు హీరో. ఈ క్రమంలోనే ఆయన ఫ్యామిలీతో కలిసిన ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
