Pooja Hegde: ప్లాపులొచ్చిన తగ్గేదే లే అంటున్న బుట్టబొమ్మ.. మరో భారీ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే..
ఇప్పటికే డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాద్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న జనగణమన సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు. అంతేకాకుండా మహేష్ బాబు, త్రివిక్రమ్

తెలుగు చిత్రపరిశ్రమలో హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతుంది హీరోయిన్ పూజా హెగ్డే (pooja hegde). ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండ సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. అయితే ఇప్పటికే పూజా నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు ఆశించిన హిట్ కాలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో పూజా కెరీర్ పై ఎఫెక్ట్ కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ప్లాపులతో సంబంధం లేకుండా పూజాకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాద్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న జనగణమన సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు. అంతేకాకుండా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న మూవీలోనూ కథానాయికగా అలరించనుంది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం పూజాకు మరో భారీ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చిందట.
ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన కబీ ఈద్ కబీ దివాలి.. రణవీర్ సింగ్‌తో సర్కస్ చిత్రాల్లో నటిస్తోంది పూజా. ఇక తాజా సమాచారం ప్రకారం తమిళ్ స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసిందట పూజా హెగ్డే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రంలో పూజ హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించినున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దక్షిణాది టూ ఉత్తరాది సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది పూజా హెగ్డే.




View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
