AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayam Ravi-Aarti: ‘నా మౌనం బలహీనత కాదు.. నన్ను తప్పుగా చూపించాలనుకుంటున్నారు’.. హీరో జయం రవి భార్య..

ప్రముఖ సింగర్ తో రిలేషన్ షిప్ అంటూ జయం రవి గురించి కొన్ని వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. తనపై వచ్చిన వార్తలు అవాస్తవమి.. అలాగే విడాకుల విషయంలో వెనక్కు తగ్గేదే లేదని.. తన ఇంట్లో ఉన్న వస్తువులను తిరిగి తనకు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు జయం రవి. ఇక తాజాగా తన గురించి వస్తున్న అసత్య ఆరోపణలపై గట్టిగానే రియాక్ట్ అయ్యింది ఆర్తి.

Jayam Ravi-Aarti: 'నా మౌనం బలహీనత కాదు.. నన్ను తప్పుగా చూపించాలనుకుంటున్నారు'.. హీరో జయం రవి భార్య..
Jayam Ravi
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2024 | 7:38 AM

Share

కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ లవబుల్ కపూల్స్‎గా ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్న జంట జయం రవి, ఆర్తి. కానీ ఇప్పుడు వీరిద్దరి విడాకుల వ్యవహరమే సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి డివోర్స్ తీసుకుంటున్నారని తెలియడంతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాకయ్యారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని జయం రవి పోస్ట్ చేయగా.. తన అనుమతి లేకుండానే డివోర్స్ ప్రకటన చేశారని.. తన భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని సుధీర్ఘ పోస్ట్ చేశారు ఆర్తి. ఆ తర్వాత ప్రముఖ సింగర్ తో రిలేషన్ షిప్ అంటూ జయం రవి గురించి కొన్ని వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. తనపై వచ్చిన వార్తలు అవాస్తవమి.. అలాగే విడాకుల విషయంలో వెనక్కు తగ్గేదే లేదని.. తన ఇంట్లో ఉన్న వస్తువులను తిరిగి తనకు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు జయం రవి. ఇక తాజాగా తన గురించి వస్తున్న అసత్య ఆరోపణలపై గట్టిగానే రియాక్ట్ అయ్యింది ఆర్తి.

జయం రవి ఆస్తులు మొత్తం ఆర్తి చేతుల్లోనే ఉన్నాయని.. తన భర్తను ఇంటి నుంచి గెంటేసిందని.. దీంతో తన వస్తువులను తిరిగి ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడని ఓ న్యూస్ నెట్టింట వైరలయ్యింది. ఈ క్రమంలోనే తన భార్య ఆర్తిపై జయం రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడనే టాక్ కూడా నడుస్తుంది. తాజాగా ఈ వార్తలపై నెట్టింట ఓ నోట్ షేర్ చేసింది ఆర్తి. ప్రస్తుతం తాను మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదని.. తన పర్సనల్ లైఫ్ గురించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

“నా పర్సనల్ లైఫ్ గురించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. నన్ను చెడుగా చిత్రీకరించి నిజాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అయినా మౌనంగా ఉంటున్నానంటే నేను తప్పు చేశానని అర్థం కాదు. కేవలం హుందాగా వ్యవహరించాలనుకుంటున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నాం అని అతడు లేఖ రిలీజ్ చేసినప్పుడు నేను నిజంగానే షాకయ్యాను. అప్పుడు నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ తనతో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుందేమోనని ఎదురుచూస్తున్నాను.. వివాహవ్యవస్థను నేను గౌరవిస్తాను.. ఇరువురి ప్రతిష్టను దెబ్బతీసే బహిరంగ చర్చలను నేను ఎంకరేజ్ చేయను. నా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యం” అంటూ రాసుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Aarti Ravi (@aarti.ravi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.