Dev Mohan: దుష్యంతుడిగా మెప్పించిన దేవ్ మోహన్.. శాకుంతలం కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా ?..

|

Apr 23, 2023 | 7:38 AM

శకుంతల, దుష్యంతుల ప్రేమకథను మరోసారి ఆడియన్స్ కళ్లముందుకు తీసుకురావాలని ఈ మూవీతో ప్రయత్నించారు గుణశేఖర్. కానీ చిన్న చిన్న పొరపాట్లు.. వీఎఫ్ఎక్స్ ఎక్కువ కావడంతో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఏప్రిల్ 14న తెలుగుతోపాటు.. కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలై అతి తక్కువ వసూళ్లు రాబట్టింది. 

Dev Mohan: దుష్యంతుడిగా మెప్పించిన దేవ్ మోహన్.. శాకుంతలం కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా ?..
Dev Mohan
Follow us on

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న సినిమా శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ ప్రేమకథలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా వచ్చిన ఈమూవీని రూపొందించారు. శకుంతల, దుష్యంతుల ప్రేమకథను మరోసారి ఆడియన్స్ కళ్లముందుకు తీసుకురావాలని ఈ మూవీతో ప్రయత్నించారు గుణశేఖర్. కానీ చిన్న చిన్న పొరపాట్లు.. వీఎఫ్ఎక్స్ ఎక్కువ కావడంతో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఏప్రిల్ 14న తెలుగుతోపాటు.. కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలై అతి తక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో మలయాళీ నటుడు దేవ్ మోహన్, అల్లు అర్హ, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, మోహన్ బాబు కీలకపాత్రలలో నటించారు.

మణిశర్మ సంగీతం అందించగా.. శేఖర్. వి. జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు దేవ్ మోహన్. శాకుంతలం చిత్రంలో దుష్యంతుడి పాత్రలో అతని నటన అద్భుతం. తన పాత్రలో దేవ్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా అల్లు అర్హ.. దేవ్ మోహన్ మధ్య జరిగే సంభాషణ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దేవ్ మోహన్. దీంతో ప్రస్తుతం అతను ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో నటించేందుకు దేవ్ మోహన్ రూ. 1.75 కోట్లు తీసుకున్నాడట. వాస్తవానికి అతను అప్ కమింగ్ హీరో. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్నారు. 1992 సెప్టెంబర్ 18న జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన దేవ్ బెంగుళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన దేవ్… 2016లో ముంబైలో నిర్వహించిన పీటర్ ఇంగ్లాండ్ మిస్టర్ ఇండియా 2016 లో పాల్గొని ఫైనలిస్ట్‏గా నిలిచాడు.

శాకుంతలం తర్వాత దేవ్ మోహన్ తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల రష్మిక మందన్నా కథానాయికగా తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.