Brahmaji : తన పెర్ఫామెన్స్‌కి నేను ఫిదా అయ్యాను.. బ్రహ్మాజీ ఇంట్రస్టింగ్ కామెంట్స్
వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ.. వర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. హీరోగా సినిమాలు చేస్తూనే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పిస్తున్నాడు సత్యదేవ్.

వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ.. వర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్(Satyadev). హీరోగా సినిమాలు చేస్తూనే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పిస్తున్నాడు సత్యదేవ్. ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్సే’(Godse). గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇంతకు సత్యదేవ్ – గోపి గణేష్ కాంబినేషన్‌లో ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రం ట్రైలర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించిన బ్రహ్మాజీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘‘సినిమాలో నేను మాట్లాడాలంటే ముఖ్యంగా సత్య గురించి చెప్పాలి. 3 నిమిషాల 26 సెకన్లుండే ప్రీ క్లైమాక్స్ సీన్‌ను సత్య సింగిల్ టేక్‌లో చేసేశాడు. ఇలా కూడా చేయొచ్చా అనిపిచింది. నాకు తెలిసి అంత అద్భుతంగా ఎవరూ చేయలేరు. ఎమోషనల్‌గా, తడుముకోకుండా సీన్‌ను పూర్తి చేశాడు సత్య. తన పెర్ఫామెన్స్‌కి నేను ఫిదా అయ్యాను. గోపీగారు, కళ్యాణ్ గారు ఉన్న ప్రాజెక్టులో నేను భాగమయ్యాను’’ అన్నారు. అలాగే దర్శకుడు గోపి గణేష్ పట్టాభి మాట్లాడుతూ ‘‘నేను, సత్యదేవ్ కలసి బ్లఫ్ మాస్టర్ మూవీ చేశాం. మళ్లీ సినిమా చేయాలనుకోగానే మరో సామాజిక సమస్యపై సినిమా చేయాలని అనుకున్నాం. ఈ దేశంలో 6.7 శాతం మంది మాత్రమే వారి చదివిన చదువుకి సరైన అర్హత ఉండే పోస్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లు అలా చేయడం లేదు. మీ అందరినీ మనసుల్లోని ప్రశ్నలను గాడ్సే ప్రశ్నించబోతున్నాడు. ప్రీ క్లైమాక్స్ సీన్‌ను సత్యదేవ్ సింగిల్ టేక్‌లో చేసేశాడు. బ్రహ్మాజీ, నోయల్ సహా అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. శాండీ రెండు నెలలు నాతో పాటు ఉండి సంగీతంతో ప్రాణం పోశాడు. సురేష్ సారంగం చక్కటి విజువల్స్ అందించాడు. జూన్ 17న రానున్న గాడ్సే మంచి సినిమాగా అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు.
