Balakrishna: అఖండ మా విజయం కాదు..సినీ పరిశ్రమ విజయం.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్..

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ థియేటర్లలో దూసుకెళ్తోంది.

Balakrishna: అఖండ మా విజయం కాదు..సినీ పరిశ్రమ విజయం.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2021 | 5:23 PM

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ థియేటర్లలో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇతర దేశాల్లోని థియేటర్లలో అఖండ మాస్ జాతర కొనసాగుతుంది. అఖండ సినిమాతో థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. బాక్సాఫీసు వద్ద అఖండ కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. అఖండ సినిమాను నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తమన్, మిర్యాల రవిందర్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు చిత్రయూనిట్.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఆనాడు రామయణాన్ని రాసిన వాడు వాల్మీకి. ఈనాడు అఖండ సినిమాను ఇంత బాగా తీర్చిదిద్దినవాడు బోయపాటి శ్రీను. ఒకనాడు భక్తిని బతికించింది రామారావు గారు. ఈనాడు సినిమాను బతికించింది భక్తి. ఆ విషయం చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమాను ఇంత విజయాన్ని చేకూర్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా ఎప్పుడూ వచ్చినా కూడా ఆదరిస్తారు అని చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. ఇది కేవలం మా విజయం. ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమా కోసం 21 నెలలు కష్టపడ్డాం. ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి, ఎంతో ఓపికపట్టి చేశారు. రకరకాల లొకేషన్లలో సినిమాను షూట్ చేశాం. కరోనా ఎంత ప్రాణాంతకమో.. కానీ వాటన్నంటిని లెక్కచేయలేదు. మంచి సినిమా చేస్తున్నాం..చిరస్థాయిగా నిలిచిపోతామన్న సంకల్పంతో పని చేశారు. దానికి ఈ ఫలితమే నిదర్శనం.

అఖండ ఓ పౌరాణికి చిత్రం. భగవంతుడిని కరుణించమని అడుగు.. కనిపించమని కాదు అని ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం యావత్ ఇండస్ట్రీ ఎదురుచూసింది. ఈ అఖండకు అఖండమైన విజయం చేకూర్చారు. సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పను. అభినందనలు తెలియజేస్తాను. ఇలాంటి సినిమాలకు ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులకు అభినందనలు. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. తిరిగి రాయాలన్నా మేమే.. ఆ నాడు రామారావు గారు సినిమా మాధ్యమం ద్వారా భక్తిని కాపాడారు. మున్ముందు తరాలకు కూడా భక్తి అంటే ఏంటో చూపిస్తాం. భక్తి అంటే విల్ పవర్. ధృడ సంకల్పం. ఇప్పుడే సినిమాను చూశాను. ఇది బాలకృష్ణనా? అని నాకే డౌట్ వచ్చింది. మంచి చిత్రాలతో, మంచి పనులతో సమాజానికి సేవ చేసేందుకు నాకు అదృష్టం దొరికింది. తమన్ మంచి సంగీతాన్ని అందించారు. చేసే పనిలోనే దైవం ఉంటుంది. మేం ఆ పనినే నమ్ముకుంటాం. ఈ ఇండస్ట్రీనే నమ్ముకుని ఉంటాం. అఖండ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్లకు అభినందనలు. సినిమాయే మాకు దైవం. నేను డైరెక్టర్ ఆర్టిస్ట్‌ని. డైరెక్టర్ ఎలా చెబితే అలా చేస్తాను’ అని అన్నారు.

ఇక అనంతరం ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీ‌ను మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఈ సినిమా విడుదలై అందరి నోటి నుంచి ఒకే ఒక మాట వచ్చింది. సూపర్ హిట్ అని అంటున్నారు. రెండు కరోనాలను ఎదుర్కొని విడుదలైన ఈ సినిమా.. నందమూరి అభిమానులు, ప్రేక్షకులందరికీ సంతోషాన్ని ఇచ్చింది. థియేటర్ల ముందు ఇంత సందడి వాతావరణం ఇరవై ఏళ్ల క్రితం చూశాం. మళ్లీ ఇప్పుడు కనిపించింది. సినిమాను ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది మా విజయం కాదు.. సినిమా విజయం.. ఇండస్ట్రీ విజయం. ఈ విజయాన్ని ఇలానే ముందుకు తీసుకెళ్లాలి’ అని అన్నారు.

Also Read: Talasani Srinivas Yadav: థియేటర్లు మూసివేయడం లేదు.. ప్రచారాలను నమ్మొద్దు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..

Kiran Abbavaram: ఇలా పరిచయం చేయాల్సి వస్తుందనుకోలేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన యంగ్ హీరో..