Ashish Vidyarthi: నేను బ్రతికే ఉన్నాను.. సినిమా ఛాన్స్‌కు ఇవ్వండి: ఆశిష్ విద్యార్థి
ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో ఆశిష్ విద్యార్థి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. 1991లో ‘కాల్ సంధ్య’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చారు ఆశిష్. పాపే నా ప్రాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక పోకిరి సినిమా తర్వాత ఆశిష్ విద్యార్థి క్రేజ్ పెరిగిపోయింది.

ఇండస్ట్రీలో చాలా మంది అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. అందులో ఆశిష్ విద్యార్థిఒకరు.. చాలా సినిమాల్లో ఆశిష్ విద్యార్థి నెగిటివ్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. చాలా సినిమాల్లో ఆశిష్ విద్యార్థి విలన్ గా నటించి మెప్పించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో ఆశిష్ విద్యార్థి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. 1991లో ‘కాల్ సంధ్య’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చారు ఆశిష్. పాపే నా ప్రాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక పోకిరి సినిమా తర్వాత ఆశిష్ విద్యార్థి క్రేజ్ పెరిగిపోయింది. ఆయనకు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి.
వరుసగా సినిమాలతో దూసుకుపోయిన ఆశిష్ కు ఈ మధ్యకాలంలో ఆఫర్స్ కరువయ్యాయి. మొన్నామధ్య సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మనాభం సినిమాలో సుహాస్ తండ్రిగా నటించి మెప్పించారు. రానా నాయుడు వంటి వెబ్‌సిరీస్‌లోనూ అదరగొట్టాడు. ఆశిష్ కేవలం తెలుగులోనే కాదు.. కన్నడ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్ భాషల్లోనూ నటించాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆశిష్ విద్యార్థికి అవకాశాలు కరువయ్యాయి. సినిమా ఛాన్స్ లు లేక ఎదురుచూస్తున్నారు ఆశిష్ విద్యార్థి. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు అవకాశాలు తగ్గడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను బతికే ఉన్నాను. నాకు కూడా సినిమా అవకాశాలు ఇవ్వండి. నన్ను గుర్తించి ఛాన్స్ లు ఇవ్వని అంటూ కామెంట్లు చేశారు. ఆ కామెంట్స్ పై ఇప్పుడు మరోసారి స్పందించారు ఆశిష్. నేను చాలా భాషల్లో సినిమాలు చేశాను. కేవలం విలన్ గానే కాదు ఎన్నో మంచి మంచి పాత్రలు కూడా చేశాను. కానీ నన్ను ఇప్పటికీ విలన్ గానే చూస్తున్నారు. నేను ఇతర పాత్రలు కూడా చేయగలను అని అన్నారు ఆశిష్ విద్యార్థి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




