Samantha: పుష్ప ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సమంత.. నో ఐటం సాంగ్, ఓన్లీ గెస్ట్ రోల్!
ఈ ఏడాది భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను పలుకరించబోతున్న విషయం తెలిసిందే. అందులో అందరూ ఎక్కువగా ఎదురుచూసేది పుష్ప2 కోసం. అయితే పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఆ సినిమాలో ఊ అంటావా పాట అంతకు మించి హిట్ అయ్యింది. అయితే పార్ట్ 2 లో నటి సమంత ఐటం సాంగ్ చేస్తుందా.. లేదా?

ఈ ఏడాది భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను పలుకరించబోతున్న విషయం తెలిసిందే. అందులో అందరూ ఎక్కువగా ఎదురుచూసేది పుష్ప2 కోసం. అయితే పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఆ సినిమాలో ఊ అంటావా పాట అంతకు మించి హిట్ అయ్యింది. అయితే పార్ట్ 2 లో నటి సమంత ఐటం సాంగ్ చేస్తుందా.. లేదా? అని ప్రతి అభిమాని ఆశగా ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ మూవీలో సమంత నటిస్తుందనే వార్తలు వినిపించడంతో మరిన్ని భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే డైరెక్టర్ సుకుమార్ అతిథి పాత్ర కోసం సమంత రూత్ ప్రభును పరిశీలిస్తున్నట్లు సమాచారం. “పుష్ప 2: ది రూల్” ముగింపులో సమంత ఓ ఎమోషన్ పాటలో కనిపించే అవకాశం ఉంది. అయితే ఐటెం సాంగ్ కాకపోవచ్చట. ఆమె క్యారెక్టర్ కొత్తగా ఉండటంతో పార్ట్-3లో కొనసాగే అవకాశం ఉన్నట్టు లేటెస్ట్ బజ్.
అయితే పుష్ప: ది రైజ్’ అల్లు అర్జున్ తో కలిసి ఊ అంటావా అనే పాపులర్ సాంగ్ తో అదరగొట్టింది సమంత. ఆ పాట టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను సైతం కదిలించింది. ఆ పాట్ హిట్ కావడంతో పుష్ప2 లో సమంత పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటి వరకు పుష్ప 2లో సమంత పాత్రకు సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిజంగానే సమంత కనిపిస్తే సర్ప్రైజ్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ ఆగస్టు 15న విడుదల కానుంది.
సమంత గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ ఫిదా చేస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ సెషన్ లో ఈ బ్యూటీ ఆకట్టుకుంది. మీట్ అండ్ గ్రీటింగ్ సందర్భంగా అభిమానుల నుంచి వచ్చిన లేఖలను హత్తుకుంటూ అందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది.
Natho enjoyment Mamulga undadu okkakadiki @Samanthaprabhu2 !!! #OhBaby #CashShow pic.twitter.com/HI9yGC95XV
— Samantha Ruth Prabhu (@Samanthaa1050) June 22, 2019
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



