Ali Home Tour: ఇంధ్ర భవనాన్ని తలపిస్తోన్న ఆలీ ఇల్లు.. ఆయన వాడే కారేంటి.? ఇంట్లో హోం థియేటర్ ఎలా ఉంది. తెలుసుకోవాలనుందా..
Ali Home Tour: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలు అభిమానులతో ఇంట్రాక్షన్ భాగా పెరిగిపోయింది. తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే..
Ali Home Tour: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలు అభిమానులతో ఇంట్రాక్షన్ భాగా పెరిగిపోయింది. తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లలో చానల్స్ ఓపెన్ చేసి మరీ తమ అభిరుచులు, తమ ఇంటి విశేషాలు వీడియో రూపంలో చేసి మరీ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రిటీలు ‘హోమ్ టూర్’ పేరుతో తమ ఇళ్లను అభిమానులకు చూపించారు. తాజాగా నటుడు, కమెడియన్ ఆలీ భార్య జుబేదా కూడా తమ ఇంటికి సంబంధించిన ‘హోమ్ టూర్’ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సహజంగా ఆలీ డౌన్ టూ ఎర్త్‌లా కనిపిస్తుంటారు. కానీ ఆయన ఇంటిని చూస్తే మాత్రం ఫిదా అవ్వాల్సిందే. మూడు అంతస్థుల్లో ఉన్న ఇళ్లు ఇంధ్ర భవనాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో జుబేదా తమ పిల్లల బెడ్ రూమ్స్‌తో పాటు ఇంటిలోని అన్ని గదులను చూపించారు. ముఖ్యంగా ఆలీ ఉపయోగిస్తోన్న బీఎమ్‌డబ్ల్యూ కారు, జిమ్ ఏరియా, హోమ్ థియేటర్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఆలీ తన సినీ జీవితంలో అందుకున్న అవార్డులు, ప్రముఖ సినీ తారలతో దిగిన ఫొటోలను హాల్‌లో అమర్చుకున్న విధానం చాలా బాగుంది. సకల సౌకర్యాలతో ఉన్న ఆలీ విల్లాను మీరూ ఓసారి చూసేయండి మరి..
Manchu Vishnu: ‘చంద్రబాబు గారు బంధువు.. జగన్ బావగారు’.. దయచేసి అలా లాగకండి
Tollywood Heroine: ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్… వరుణ్ తేజ్ మూవీలో నటించింది.. గుర్తించారా