
ఓవైపు సినిమాలు.. మరోవైపు కారు రేసులతో బిజి బిజీగా గడుపుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. ఇటీవల అతను నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఈ మధ్యలోనే వివిధ దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లోనూ సత్తా చాటాడు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్ఠాత్మక పద్మ భూషన్ అవార్డును ప్రదానం చేసింది. సినిమాల్లో స్టార్ హీరో అయినప్పటికీ రియల్ లైఫ్ లో ఎంతో సింపుల్ గా ఉంటాడు అజిత్. గతంలో ఎన్నో సార్లు ఇది నిరూపితమైంది. తన అభిమాన సంఘాలను కూడా రద్దు చేసిన ఘనత అజిత్ సొంతం. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో కార్ రేసింగ్ కు రెడీ అవుతున్నాడు అజిత్. ఇందుకోసం ప్రస్తుతం అతను ఇటలీలో పర్యటిస్తున్నాడు. తాజాగా అజిత్ తన అభిమాన కార్ రేసర్ కు నివాళులు అర్పించారు. స్టార్ హీరో అన్న గర్వం లేకుండా ఆయన విగ్రహం పాదాలకు ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతన్నాయి. వీటిని చూసి అభిమానులు ఫిదా అవుతన్నారు.
ఇంతకు అజిత్ ముద్దు పెట్టింది ఎవరి కాళ్లకో తెలుసా? ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ అయర్టన్ సెన్నా. బ్రెజిల్ దేశానికి చెందిన అయర్టన్ సెన్నా మూడు సార్లు(1988,1990,1991) ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. తద్వారా వరుసగా మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అయితే 1994 కార్ రేసింగ్‌లో జరిగిన ప్రమాదంలో దురదృష్టవశాత్తూ అయర్టన్ కన్నుమూశారు. సెన్నా సాధించిన ఘనతలకు ప్రతీకగా ఇటలీ పార్క్ లో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడకి వెళ్లిన హీరో అజిత్ అయర్టన్ సెన్నాకు నివాళులర్పించారు. ఆయన విగ్రహం పాదాలకు ముద్దు పెట్టాడు. చాలా సేపు ఆ విగ్రహాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో అజిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
🚨Clip 1: AK Paying respects to His Inspiration in life
His idol “ Ayrton Senna “ 🥹❤️📸Clip 2: Michael’s emotions poured out when he equalled Senna’s 41 Wins record YEARS later.#AjithKumarRacing | #F1 | #Senna pic.twitter.com/VUXq4259mq
— Gokul Ramasamy (@imgokulramasamy) May 20, 2025