AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadi Sai Kumar: కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. క్రేజీఫెలోగా రాబోతున్న ఆది సాయి కుమార్.. ఫస్ట్ లుక్..

లవ్ లీ, సుకుమారుడు.. అంటూ వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు..

Aadi Sai Kumar: కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. క్రేజీఫెలోగా రాబోతున్న ఆది సాయి కుమార్.. ఫస్ట్ లుక్..
Aadi Sai Kumar
Rajitha Chanti
|

Updated on: May 19, 2022 | 5:27 PM

Share

సీనియర్ హీరో సాయి కుమార్ తనయుడిగా ప్రేమకావాలి అంటూ తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు ఆది సాయి కుమార్ (Aadhi sai kumar). ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. లవ్ లీ, సుకుమారుడు.. అంటూ వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు.. అయితే ఈ మూడు చిత్రాల తర్వాత ఆదికి సరైన హిట్ పడలేదు.. వరుస ప్రాజెక్టులతో వస్తున్న ఆడియన్స్ ను మెప్పించలేకపోయాడు ఈ యంగ్ హీరో. చాలా కాలంగా ఈ హీరో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ హిట్ కొట్టేందుకు కసి మీదున్నాడు. తాజాగా ఆది సాయి కుమార్ మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు.. ఎప్పటికప్పుడు ప్రాధాన్యత ఉన్న స్టోరీలను ఎంచుకుంటూ వస్తున్న ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా డైరెక్టర్ ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వస్తోన్న తాజా చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో నిర్మాత కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. ఆది సాయికుమార్ ఫస్ట్ లుక్ లో చాలా యంగ్ అండ్ రిఫ్రెషింగ్ కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ వీడియో లో ఆది చేష్టలు సినిమా టైటిల్ కి తగ్గట్టు చాలా క్రేజీగా వున్నాయి. ఆది వేసుకున్న టీషర్టు పై ‘ఎవడి యాంగిల్ వాడిది”అని రాసిన క్యాప్షన్ సినిమాలో హీరో పాత్రని సూచిస్తుంది. హెయిర్ స్టయిల్ , ట్రెండీ దుస్తులు, లైట్ గడ్డం ఇవన్నీ అది లుక్ ని మరింత స్టయిలీస్ గా చూపించాయి. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, ‌ సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!