
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మారుమోగుతుంది. సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ విషయాలతోనే వార్తలలో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన విడాకుల వివాదం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తితో విభేధాలు రావడంతో డివోర్స్ తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. విడాకుల వివాదం నడుస్తుండగానే సింగర్ కెన్నీషాతో జయం రవి కనిపించడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. సినిమా ఈవెంట్స్, పార్టీలతోపాటు ఇప్పుడు ఆలయాలను సైతం కలిసి సందర్శిస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీంతో మరోసారి జయం రవి, కెన్నీషా డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..
ఈ క్రమంలోనే తాజాగా జయం రవి భార్య ఆర్తి సోషళ్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ” నువ్వు ఇతరులను మోసం చేయ్యెచ్చు.. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ దేవుడిని మోసం చేయలేవు” అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీంతో ఆమె జయం రవిని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇటీవల ఆమె పిల్లలను ఉద్దేశిస్తూ సైతం ఓ నోట్ షేర్ చేశారు. “ఉత్తమ తల్లిదండ్రులంటే వారెప్పుడూ పిల్లల కోసమే ఆలోచిస్తారు. ఎందుకంటే అమాయకులపైన పిల్లలు అందరి ప్రేమకు అర్హులు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారిని కాపాడుకోండి” అంటూ రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
ప్రస్తుతం జయం రవి, ఆర్తి విడాకుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి ప్రమేయం రావడంతోనే డివోర్స్ తీసుకుంటున్నారనే ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉంది. తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుచూ ఆర్తి ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..