Laal Singh Chaddha: అమీర్ ను ముప్పుతిప్పలు పెడుతోన్న అప్పటి మాటలు.. ఇంతకు సినిమా రిలీజ్ అయ్యేనా..?
ప్రస్తుతం మోస్ట్ ఏవైటెడ్ మూవీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమా ఒకటి. లాల్ సింగ్ చడ్డా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అమీర్.
ప్రస్తుతం మోస్ట్ ఏవైటెడ్ మూవీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమా ఒకటి. లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha) అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అమీర్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుతెచ్చుకున్న అమీర్ సినిమాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నప్పటీకీ ప్రేక్షకులను అలరించే సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే లాల్ సింగ్ సినిమాతో.. సూపర్ డూపర్ హిట్ కొడదామనుకున్న అమీర్ ఆశలపూ నీళ్లు చల్లుతున్నారు కొంత మంది ట్రోలర్స్. తను ఎప్పుడో మాట్లాడిన మాటలను తెరమీదికి తీసుకొచ్చి హిందుత్వ వ్యతిరేఖ వాదిగా ఇప్పటికీ ముద్రేస్తున్నారు. ఆ కారణంతోనే బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ.. ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మీమ్స్ తో సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అమీర్ ను పరేషాన్ చేస్తున్నారు.
హీరోగా వెర్సటైల్ సినిమాలు చూజ్ చేసుకునే అమీర్ ఖాన్.. ఫస్ట్ టైం సత్యమేవ జయతే అనే టెలివిజన్ షో చేశారు. సమాజంలో ఉన్న అసమానతలను ఆ షో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సాజిక రుగ్మతలపై తన గళాన్ని వినిపించారు. ఈ క్రమంలోనే.. దేవుళ్లకు చేసే క్షీరాభిషేకాలపై విమర్శలు చేశారు. శివలింగానికి క్షీరాభిషేకం చేసే బదులు ఆ పాలను పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వాడవచ్చుగా అంటూ.. సత్యమేవ జయతే షో వేదికగా చెప్పారు. దీంతో అప్పట్లో హిందుత్వ సంఘాలు భగ్గుమన్నాయి. అమీర్ ను విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. అయితే ఇవే సంఘాలు తాజాగా అమీర్ పై ఆయన లేటెస్ట్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా మరో సారి యుద్దాన్ని ప్రకటించాయి. అమీర్ లాల్ సింగ్ చడ్డా సినిమాను ఎవరూ చూడొద్దిన పిలుపునిస్తున్నాయి. బాయ్ కాట్ చేయాలంటూ.. ట్రెండ్ చేస్తున్నాయి. దీనిపై అమీర్ స్పందిస్తూ.. తన సినిమాను బాయ్ కాట్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కొందరు నేను ఈ దేశాన్ని ఇష్టపడనని అంటున్నారు. అది అవాస్తవం. అందుకు బాధ కలుగుతోంది. వాళ్ల మనసుకు అలా అనిపించి ఉండవచ్చు. కానీ నేను ఈ దేశాన్ని ఇష్టపడతాను. దయచేసి నా సినిమాను ఆపాలని చూడకండి అంటూ రిక్వస్ట్ చేశారు అమీర్. లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి