Miss World 2024: ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభం.. భారత్ నుంచి వెళ్లిన అందాల తార గురించి తెలుసా ?…
మూడు దశాబ్దాల తర్వాత మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం భారత్ వేదికగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఈ వేడుకల గురించి సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచం భారతదేశంతో పరిచయం పొందడానికి.. అలాగే భారత్ అందిస్తున్న ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఇది అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. మిస్ వరల్డ్ ఓపెనింగ్ వేడుక ఈరోజు సాయంత్రం (ఫిబ్రవరి 20)న missworld.comలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది.

71వ మిస్ వరల్డ్ ఈవెంట్ ప్రారంభమయ్యింది. ఈ వేడుకలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. దాదాపు 28 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. మూడు దశాబ్దాల తర్వాత మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం భారత్ వేదికగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఈ వేడుకల గురించి సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచం భారతదేశంతో పరిచయం పొందడానికి.. అలాగే భారత్ అందిస్తున్న ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఇది అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. మిస్ వరల్డ్ ఓపెనింగ్ వేడుక ఈరోజు సాయంత్రం (ఫిబ్రవరి 20)న missworld.comలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 71వ మిస్ వరల్డ్ గ్లోబల్ ఫినాలే జరుగుతుంది. ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి 120 మంది పోటీదారులు పాల్గొననున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అద్భుతమైన ఈవెంట్‌తో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ముగుస్తుంది.
ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC) 71వ మిస్ వరల్డ్ ఈవెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని ది ఆషిక్‌లో ‘ది ఓపెనింగ్ సెర్మనీ’, ‘ఇండియా వెల్‌కస్ ది వరల్డ్ గాలా’ని నిర్వహించనుంది. ఫ్యాషన్ డిజైనర్ అర్చన కొచ్చర్ 71వ మిస్ వరల్డ్ పోటీకి అధికారిక ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్నారు. ఈఏడాది మిస్ వరల్డ్ పోటీలకు భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) పాల్గొననుంది. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లింది సినీ శెట్టి. “నువ్వే నా లక్ష్యం, నువ్వే నా గుర్తు. ఈ ప్రయాణంలో ఈరోజు నేను నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నాను. నా దేశపు త్రివర్ణ పతాకాన్ని చేతిలోనే కాదు.. గుండెల్లో పెట్టుకున్నాను ” అంటూ జాతిని ఉద్దేశించి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
సినీ శెట్టి స్వస్తలం కర్ణాటకలోని ఉడిపి. ఆమె అకౌంటింగ్, ఫైనాన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. అలాగే ఆమె భారతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఆమె మార్కెటింగ్ లో ఉద్యోగం చేస్తుంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదిక కావడం పట్ల సినీ శెట్టి హర్షం వ్యక్తం చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




