
దక్షిణాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ మూవీ ఒకటి. 70 ఏళ్ల హీరో సరసన 35 ఏళ్ల హీరోయిన్ నటించిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ? సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పటివరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోగా బ్యా్క్ టూ బ్యా్క్ చిత్రాలతో మెప్పిస్తున్నారు. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజినీ.. ఇప్పుడు కూలీ మూవీతో రికార్డ్స్ కొల్లగొడుతున్నారు. కానీ మీకు తెలుసా.. ఒక దశాబ్దం క్రితం రజినీ నటించిన ఓ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ వార్తలలో నిలిచాయి. అదే కబాలి. 2016లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఇందులో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
నిజ జీవితంలో రజినీ చాలా సింపుల్‌గా ఉంటాడు. 2016లో వచ్చిన ‘కబాలి’ చిత్రంలో ఆయన నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తన కెరీర్‌లో రజనీకాంత్ తన సహజమైన తెల్లటి గడ్డంతో తెరపై కనిపించిన చిత్రం కబాలి. 90లలో చాలా కాలం విరామం తర్వాత రజినీ తన నిజమైన లుక్‌లో తెరపై కనిపించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. 2016 లో విడుదలైన రజనీకాంత్ ‘కబాలి’ అత్యధికంగా లైక్ చేయబడిన భారతీయ చిత్రాలలో ఒకటి. IMDb నివేదిక ప్రకారం, కబాలి టీజర్ YouTube లో రెండు గంటల్లో 1 మిలియన్ వ్యూస్, 1 లక్ష లైక్స్ పొందిన రికార్డును సృష్టించింది. 15 జూలై 2016 నాటికి, ఫేస్‌బుక్‌లో ప్రపంచవ్యాప్తంగా 4 సార్లు ట్రెండ్ అయిన ఏకైక భారతీయ చిత్రం ఇదే.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..
Kabali Movie
100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘కబాలి’ బాక్సాఫీస్ వద్ద 650 కోట్లు వసూలు చేసింది. భారతదేశంతో పాటు అమెరికా, నార్వే, యుఎఇ, మలేషియా, ఆస్ట్రేలియాలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కబాలి ప్రపంచవ్యాప్తంగా 8000-10000 స్క్రీన్లలో విడుదలైంది. ఇందులో యుఎస్‌లో 480 స్క్రీన్లు, మలేషియాలో 490, గల్ఫ్ దేశాలలో 500 స్క్రీన్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..