AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్ ఇండియా స్టార్ కోసం భారీ ప్లాన్ వేస్తున్న ప్రశాంత్ నీల్.. సినిమాకు అదే హైలైట్ అంట..

ప్రభాస్ సినిమా కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డార్లింగ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇప్పుడు ఫాన్స్ ను మరింత ఖుష్ చేసేందుకు..

పాన్ ఇండియా స్టార్ కోసం భారీ ప్లాన్ వేస్తున్న ప్రశాంత్ నీల్.. సినిమాకు అదే హైలైట్ అంట..
Salaar
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2021 | 9:07 PM

Share

salaar movie: ప్రభాస్ సినిమా కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డార్లింగ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇప్పుడు ఫాన్స్ ను మరింత ఖుష్ చేసేందుకు.. నో గ్యాప్ అంటూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన రెబల్ స్టార్ ఇప్పుడు సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమానుంచి బయటకు వచ్చిన పోస్టర్ లీకైన ఫోటోలు సినిమా పై హై ఎక్స్పెటెషన్స్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు డార్లింగ్. ఈ సినిమాలో మాఫియా డాన్ గా ప్రభాస్ కనిపించనున్నాడని మొదటినుంచి టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ తో టాల్ బ్యూటీ శృతిహాసన్ రొమాన్స్ చేయనుంది. తాజాగా ఈ సినిమాను సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ వినిపిస్తుంది.

ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయట… అలాగే అదిరిపోయే బైక్ ఛేజ్ కూడా ఉండనుందని తెలుస్తుంది. దీనిలో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు, మైసూరులోనే మేజర్ షెడ్యూల్స్ షూటింగ్ జరపనున్నారు. అయితే సలార్ కోసం భారీ సెట్స్ ను కూడా వేయిస్తున్నారట. ఈ మూవీలో కొన్ని సన్నివేశాల కోసం ఏకంగా 1970 కాలాన్నిసంబంధించిన సెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారట. నాటి కాలాన్ని తలపించేలా అద్భుతమైన సెట్‌ని మైసూర్‌లో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆర్ట్ వర్క్ టీమ్‌ని దించుతున్నారట. అంతే కాదు ఆ కాలానికి చెందిన బైక్ ను కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. 2022 సమ్మర్ నాటికి సలార్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని హోంబలే సంస్థ భావిస్తోంది. దానికి తగ్గట్టు షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

స్టేజ్ పైనే అందరుచూస్తుండగానే ప్రపోజ్ చేసిన శ్రీముఖి.. మొత్తానికి లవ్ లో పడిందిగా..

మేకప్ లేకుండా కింగ్ ఇలా ఉంటారా ? నాగ్ వర్జినల్ లుక్ ఇదా..?షాక్ లో అభిమానులు..:King Nagarjuna New Look video.

Anchor Ravi: ఊహించని గెటప్ లో యాంకర్ రవి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..

Follow Us