Akhanda 2 : తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము.. అఖండ2 విడుదలపై 14 రీల్స్‌ మరో ప్రకటన..

అఖండ 2 విడుదల చుట్టూ అనంత అనుమానాలున్నాయి.. చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ఆగిపోవడంతో ఫ్యాన్స్‌కు షాక్ తప్పలేదు. ఈ సినిమాను చుట్టుముట్టిన సమస్యలు కనిపించేంత చిన్నవైతే కాదని అర్థమవుతుంది. జరిగిందేదో జరిగిపోయింది.. గతం గత:.. మరి ఫ్యూచర్ ఏంటి..? బాలయ్య సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు..? ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు..? అనేది ఇప్పుడు మొదలైన సమస్య.

Akhanda 2 : తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము.. అఖండ2 విడుదలపై 14 రీల్స్‌ మరో ప్రకటన..
Akhanda 2

Updated on: Dec 06, 2025 | 8:03 AM

అన్నీ అనుకున్నట్లు జరిగుంటేపాటికి థియేటర్లలో పూనకాలు పుట్టించేవారు బాలయ్య. అఖండ 2తో అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చేవారు. కానీ అనుకోని ఆర్థిక సమస్యలు ఈ సినిమాను విడుదల కాకుండా ఆపేసాయి. ఈ సమస్యలు తీరేదెప్పుడు.. మళ్లీ రిలీజ్ అయ్యేదెప్పుడు అనే చర్చ మొదలైందిప్పుడు. డిసెంబర్ 5 చాలా మంచి డేట్.. ఇప్పుడైతే మిస్ అయిపోయింది. అయిందేదో అయిపోయింది.. కానీ ఒక్కటైతే నిజం మంచి డేట్ అయితే జారిపోయింది. అలాగే ఓవర్సీస్‌లో కూడా అఖండ 2కు డిసెంబర్ 5 లాంటి మంచి డేట్ అయితే దొరకదు. మళ్లీ అక్కడ అన్ని స్క్రీన్స్ దొరకడం కష్టమే.. ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కారమై విడుదలైనా కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ లాస్ తప్పదు. అందుకే మంచి డేట్ కోసం చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..

అఖండ 2 సమస్యలు అలాగే కంటిన్యూ అయితే.. ఇంత మంచి రిలీజ్ డేట్ మళ్లీ ఎప్పుడు దొరుకుతుందనేది ఆసక్తికరమే. నెక్ట్స్ పాజిబుల్ డేట్స్ ఓసారి చూస్తే.. డిసెంబర్ 12 ఉంది. కానీ అదేరోజు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ, కార్తి నటిస్తున్న అన్నగారు వస్తారు లాంటి సినిమాలున్నాయి. ఇక డిసెంబర్ 19కి అవతార్ 3 ఉంది. డిసెంబర్ 12, 19 మిస్ అయితే.. 25 పాజిబుల్ డేట్ అవుతుంది. ఆ రోజు వైజయంతి మూవీస్ ఛాంపియన్‌, ఆది సాయికుమార్ శంబాలాతో పాటు మరో రెండు సినిమాలున్నాయి. క్రిస్మస్ కూడా మిస్సైతే సంక్రాంతి పోటీ భారీగా ఉంది కాబట్టి సమస్య మరింత క్లిష్టమవుతుంది. చూడాలిక.. ఇన్ని డేట్స్‌లో అఖండ 2 ఆగమనం ఏ రోజు ఉండబోతుందో..?

ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..

ఈ క్రమంలోనే అఖండ 2 రిలీజ్ పై మరో ప్రకటన చేశారు మేకర్స్. అఖండ2ని విడుదల చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాం. కాని మా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. బాలయ్య అభిమానులు, సినీ ప్రేమికులకు క్షమాపణలు. ఈ సమయంలో బాలయ్య, బోయపాటి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. అఖండను విడుదల చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాంఅంటూ ప్రకటన చేశారు.

ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..