ఆ ఏడాది చాలా దారుణంగా గడిచింది.. కష్టాలు గుర్తు చేసుకున్న 12th ఫెయిల్ హీరోయిన్

2023లో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమాని ఆదరించారు. చాలా మంది ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్, ఐఆర్ఎస్ అధికారిణి శ్రద్ధా జోషి పాత్రలో మేధా నటించారు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది.

ఆ ఏడాది చాలా దారుణంగా గడిచింది.. కష్టాలు గుర్తు చేసుకున్న 12th ఫెయిల్ హీరోయిన్
Medha Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 27, 2024 | 5:25 PM

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో 12th ఫెయిల్. విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ నటించిన ’12th ఫెయిల్’ గత సంవత్సరం విడుదలై ప్రశంసలు అందుకుంది. 2023లో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమాని ఆదరించారు. చాలా మంది ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్, ఐఆర్ఎస్ అధికారిణి శ్రద్ధా జోషి పాత్రలో మేధా నటించారు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ’12th ఫెయిల్‌’ చిత్రానికి ఐఎండీబీలో 9.1 రేటింగ్‌ వచ్చింది. సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి మేధా శంకర్ తన కష్టాల గురించి మాట్లాడింది. ఒకప్పుడు తన ఖాతాలో కేవలం 257 రూపాయలు మాత్రమే ఉండేవని తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మేధా మాట్లాడారు. తన జీవితంలో ఎన్నో కష్టాలను చూశానని తెలిపింది మేధా. మేధా 2015లో నటించడం ప్రారంభించింది. మొదట షార్ట్ ఫిల్మ్ లో నటించింది. 2022లో ఆమె ’12th ఫెయిల్’ సినిమా కోసం కాస్టింగ్ ఏజెన్సీకి ఆడిషన్ ఇచ్చింది. తర్వాత దర్శకుడు విధు వినోద్ చోప్రా టీమ్ మేధాకు స్క్రీన్ టెస్ట్ నిర్వహించింది. శ్రద్ధా జోషి పాత్రకు తనను ఎంపిక చేశారని తెలియగానే మేధా తన తండ్రిని కౌగిలించుకుందట. బెంగళూరులో ఉంటున్న తన సోదరుడికి ఫోన్ చేసి ఈ సంతోషకరమైన వార్తను పంచుకుందట.

ఆమె మాట్లాడుతూ..  నా సినీ కెరీర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. 2020 చాలా దారుణంగా ఉంది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో నా బ్యాంకు ఖాతాలో కేవలం 257 రూపాయలు మాత్రమే ఉన్నాయి. పేరు, డబ్బు కోసం పరిశ్రమలోకి రావాలనుకోలేదు. ఈ విషయాల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ నాకు క్రాఫ్ట్ , ఆర్ట్ అంటే చాలా ఇష్టం. అలా ఈ రంగంలోకి అడుగుపెట్టాను. నటనే నా ప్రపంచం అని గ్రహించాను’ అని మేధా అన్నారు. ’12వ ఫెయిల్’ సినిమా అక్టోబర్ 27, 2023న థియేటర్లలో విడుదలైంది. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడటానికి అందుబాటులో ఉంది. ఇందులో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, సంజయ్ బిష్ణోయ్ మరియు హరీష్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.