టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక చోట చేరిన వేళ.. పండుగ చేసుకుంటున్న అభిమానులు. ఈ క్రెడిట్ అంతా దిల్ రాజుదే.

ఓ అద్భుత దృశ్యానికి దిల్ రాజు పుట్టిన రోజు వేడుక వేదికగా మారింది. అదే టాలీవుడ్‌కు చెందిన బడా, యంగ్ హీరోలంతా ఒక చోట చేరడం. దిల్ రాజ్‌తో పాటు స్టార్ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగచైతన్య, రామ్, విజయ్ దేవరకొండ కెమెరాకు ఫోజులిచ్చారు.

టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక చోట చేరిన వేళ.. పండుగ చేసుకుంటున్న అభిమానులు. ఈ క్రెడిట్ అంతా దిల్ రాజుదే.
Narender Vaitla

|

Dec 18, 2020 | 6:44 PM

Tollywood young heroes in one photo: చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలు పెట్టిన దిల్‌రాజు టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు. దిల్‌రాజు ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడంటే చాలు.. అది మినిమం గ్యారంటీ అనే భావన అటు ఇండస్ట్రీతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ బలంగా పాతుకుపోయింది. దిల్ రాజు తాజాగా శుక్రవారం 50వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఇదే ఏడాదిలో రెండో వివాహం చేసుకున్న విషయం విధితమే. గతంలో ఎన్నడూ లేని విధంగా దిల్ రాజు తన పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కట్టారు.

ఈ క్రమంలోనే ఓ అద్భుత దృశ్యానికి దిల్ రాజు పుట్టిన రోజు వేడుక వేదికగా మారింది. అదే టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరోలంతా ఒక చోట చేరడం. దిల్ రాజ్‌తో పాటు స్టార్ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగచైతన్య, రామ్, విజయ్ దేవరకొండ కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరోలంతా ఒక చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ ఫొటోను బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక ఇదే ఫొటోను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ షేర్ చేస్తూ.. ‘బిగ్ బాయ్స్‌తో ది కిడ్’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ను జోడించాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu