AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ రౌండప్ : బాలయ్య, బన్నీ, సమంత, రవితేజ, వైష్ణవ్ తేజ్, కార్తికేయ, తదితర సినీ స్టార్స్ ఫిల్మ్ న్యూస్ టూకీగా

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాను మే 28న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ప్రగ్యా జైస్వాల్‌,..

టాలీవుడ్ రౌండప్ : బాలయ్య, బన్నీ, సమంత, రవితేజ, వైష్ణవ్ తేజ్, కార్తికేయ, తదితర సినీ స్టార్స్ ఫిల్మ్ న్యూస్ టూకీగా
Venkata Narayana
|

Updated on: Feb 01, 2021 | 5:45 AM

Share

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాను మే 28న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

పుష్ప మూవీ నెక్ట్స్ షెడ్యూల్‌ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం మారేడుమిల్లిలో షూటింగ్‌ జరుపుకుంటున్న టీం… నెక్ట్స్ తెన్‌కాశీలో షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్‌లో బన్నీ, రష్మికపై రొమాంటిక్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

సమంత డిజిటిల్‌ ఎంట్రీ ఇబ్బందుల్లో పడింది. ఫిబ్రవరి 12న రిలీజ్ కావాల్సిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌ సిరీస్‌ విడుదల వాయిదా పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 19 రిలీజ్ కావాల్సిన ట్రైలర్‌ ఇంత వరకు రిలీజ్ కాలేదు.

ఇంకో ఐదు రోజుల్లో ఆహాలో ప్రసారం కానుంది క్రాక్‌ మూవీ. రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలై విజేతగా నిలిచింది. ఆహా ప్రేక్షకుల కోసం ఫిబ్రవరి 5 నుంచి ప్రసారం కానుంది. గోపీచంద్‌ మలినేని డైరక్టర్‌.

వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి నటిస్తున్న ఉప్పెన సినిమా నుంచి జల జల జలపాతం నువ్వు పాటను విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ఈ పాట తనకెంతో స్పెషల్‌ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌. సానా బుచ్చిబాబు డైరక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది.

కార్తికేయ, లావణ్య జంటగా తెరకెక్కుతున్న చావుకబురు చల్లగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్‌ బ్యానర్‌పై బ‌న్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు.

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్ తెరకెక్కిస్తున్న ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం ఆదివారం మొదలైంది. ఫిబ్రవరి 4 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. విమల్‌ కృష్ణ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఎఫ్‌సీయుకే సినిమా నుంచి మరో పాట విడుదలైంది. నిజ జీవిత హీరోలతో ఈ చిత్రంలోని పాటలను విడుదల చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా సీనియర్‌ జర్నలిస్టులు సాయి రమేష్‌, నాగేంద్రకుమార్‌ హే హుడియా అనే నాలుగో పాటను రిలీజ్‌ చేశారు.

నవీన్‌ పొలిశెట్టి లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన డిటెక్టివ్‌ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’. ఈ సినిమాను కోలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. కామెడీ స్టార్‌ సంతానం హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మనోజ్‌ బీధా దర్శకుడు.