Laya: డ్యాన్స్‌తో అదరగొట్టిన లయ.. ఆ పాటలో అచ్చం మెగాస్టార్‌ని దించేసిందిగా.. Watch Video
అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో వెండితెరకు పరిచయమై.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.
అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో వెండితెరకు పరిచయమై.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత జగపతి బాబు.. రాజశేఖర్, అర్జున్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని మెప్పించింది. అయితే వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం భర్త.. కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్న లయ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ మాత్రమే కాదు.. స్నేహితులతో కలిసి ఎవర్ గ్రీన్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
తాజాగా లయ తన స్నేహితులతో కలిసి వెకేషన్‌కి వెళ్లింది. ఆ సమయంలో తన స్నేహితురాలితో ఓ జలపాతం ఒడ్డున అద్దిరిపోయే డ్యాన్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786 సినిమాలోని ఫేమస్ సాంగ్ అయిన ‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట’ పాటకు సూపర్ డ్యాన్స్ చేసింది లయ. ఈ రీల్‌ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది. అచ్చం మెగాస్టార్ మాదిరిగా డ్యాన్స్ చేసింది అదరగొట్టింది లయ. పసుపు రంగు చీరలో, చిరుదరహాసం ఇస్తూ.. ఆ పక్కనే హోయలుపోతున్న నదీ ఒడ్డున అందాల లయ చేసిన సందడికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వీడియోపై ఓ లుక్కేసుకోండి..
లయ డ్యాన్స్ వీడియోను చూడండి..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..