AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: తండ్రి కాబోతున్న శుభవార్తను చరణ్ ముందుగా ఎవరికీ చెప్పారో తెలుసా ?.. ఎవరంటే..

ఓవైపు పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ఎంజాయ్ చేస్తున్న చరణ్..మరోవైపు తమ మొదటి బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Ram Charan: తండ్రి కాబోతున్న శుభవార్తను చరణ్ ముందుగా ఎవరికీ చెప్పారో తెలుసా ?.. ఎవరంటే..
Charan
Rajitha Chanti
|

Updated on: Feb 23, 2023 | 9:57 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డ్ ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు చరణ్. ఈ క్రమంలో అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో అలరించారు. ఓవైపు పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ఎంజాయ్ చేస్తున్న చరణ్..మరోవైపు తమ మొదటి బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

అయితే ఈ శుభవార్తను నెట్టింట అభిమానులతో షేర్ చేసుకోవడానికి ముందు.. చరణ్ మరొకరితో పంచుకున్నారట. ఇటీవల లాస్ ఏంజిల్స్ మీడియాతో మాట్లాడిన చెర్రీ.. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ముందుగా తన బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్ కు చెప్పానని అన్నారు. రామ్ చరణ్ తో ఆడుకోవడానికి తన పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారని తారక్ అన్నారు. వీరిద్దరు ఆస్కార్ 2023కి ముందు అమెరికాలో జరిగి ఈవెంట్లలో పాల్గొనున్నారు.

“ప్రకటన చేయడానికి ముందు నా ఆనందాన్ని పంచుకోవడానికి మొదట తారక్‌కి ఫోన్ చేసాను. మేము నిజంగా సంతోషంగా ఉన్నాము, వ్యక్తిగతంగా , వృత్తిపరంగా మా జీవితంలో బాగానే ఉన్నాము. మేము మా జీవితాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభించాము. ఇది ఒక అందమైన అనుభూతిని కలిగిస్తుంది. మరో వ్యక్తిని స్వాగతిస్తున్నందుకు మా అమ్మ, నాన్న సంతోషంగా ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చారు. ఆస్కార్ వేడుకల కంటే ముందు చరణ్.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డు ప్రధానోత్సవం వేడుకలలో పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్