Tollywood: స్టార్ హీరోలు లేరు.. కానీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సినిమా.. రీరిలీజ్‏లో హావా..

స్టార్ హీరోలు నటించిన చిత్రాలు భారీగానే కలెక్షన్స్ రాబట్టాయి. రీరిలీజ్ కలెక్షన్లలో ఏకంగా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగుతోపాటు ఇప్పుడిప్పుడే తమిళంలోనూ ఈ ట్రెండ్ ప్రారంభమవుతుంది. కొత్త సినిమాలతోపాటు పాత చిత్రాలు కూడా పోటీ పడి మరీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

Tollywood: స్టార్ హీరోలు లేరు.. కానీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సినిమా.. రీరిలీజ్‏లో హావా..
Tumbbad Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 08, 2024 | 4:12 PM

కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద రీరిలీజ్ ట్రెండ్ తెగ నడుస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు, అడియన్స్ మెచ్చిన డిజాస్టర్స్ మరోసారి రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టార్ హీరోలు నటించిన చిత్రాలు భారీగానే కలెక్షన్స్ రాబట్టాయి. రీరిలీజ్ కలెక్షన్లలో ఏకంగా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగుతోపాటు ఇప్పుడిప్పుడే తమిళంలోనూ ఈ ట్రెండ్ ప్రారంభమవుతుంది. కొత్త సినిమాలతోపాటు పాత చిత్రాలు కూడా పోటీ పడి మరీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక తమ అభిమాన తారల హిట్ చిత్రాలు మరోసారి విడుదలవుతుండడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తమ హీరోల రికార్డ్స్ గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందరి అంచనాలను మించి ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. అదే తుంబాడ్.

2018లో అక్టోబర్ లో బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలై భారీ విజయాన్ని సాధించిన చిన్న సినిమా ఇది. హారర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు.. ఒళ్లుగగుర్బోడిచే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సినిమా ఇది. కానీ కేవలం నార్త్ ఇండస్ట్రీలోనే సక్సెస్ అయ్యింది. దేశవ్యాప్తంగా అంతగా రీచ్ కాలేదు. ఆ తర్వాత ఓటీటీలో కొంతవరకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు.

ఈ సినిమాను సెప్టెంబర్ లో దేశమంతా రీరిలీజ్ చేయగా.. హారర్ అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తుంబాడ్ రీరిలీజ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఈ చిత్రంలో విడుదలైనప్పుడు రూ.16 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ ఇప్పుడు రీరిలీజ్ చేసిన తర్వాత ఏకంగా రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. సెకండ్ రిలీజ్ లో మొదటిసారి కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా దేశంలో ఏ స్టార్ హీరో సినిమా కూడా రీరిలీజ్ లో ఇంతగా కలెక్షన్స్ రాబట్టిన సందర్భాలు లేవు. కానీ స్టార్ హీరోలు లేకుండా వచ్చిన చిన్న సినిమా మాత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రీరిలీజ్ సినిమాగా తుంబాడ్ నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!