AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thimmarajupalli TV: ఓటీటీలోకి తిమ్మరాజుపల్లి టీవీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడతను నిర్మాతగా మారాడు. కొత్త వారిని పరిచయం చేస్తూ కిరణ్ స్వయంగా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. వి. మునిరాజ్ తెరకెక్కించిన ఈ రూరల్ కామెడీ ఎంటర్ టైనర్ లో సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Thimmarajupalli TV: ఓటీటీలోకి తిమ్మరాజుపల్లి టీవీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..
Thimmarajupalli Tv
Rajeev Rayala
|

Updated on: May 07, 2026 | 9:54 PM

Share

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : Banerjee: ఎవరైనా ఆ హీరో బయోపిక్ తీయాలి.. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కున్నాడు..

తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యింది. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆహా గోల్డ్ యూజర్స్ 24 గంటల ముందుగానే ఈ చిత్రాన్ని చూడొచ్చు. థియేట్రికల్ గా ప్రేక్షకుల్ని అలరించిన “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఇప్పుడు ఆహా ద్వారా మరింతమంది ఆడియెన్స్ కు చేరువకానుంది.

ఇది కూడా చదవండి :లేటుగా వచ్చాడని ఆ స్టార్ హీరోని రోజంతా ఎండలో నిలబెట్టారు.. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో పెద్ద స్టార్

చిన్న సినిమాగా వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పై సినీ ప్రముఖలు ప్రశంసలు కురిపించారు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఆహాలో ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : వార్ని..! విజయ్‌తో ఉన్న ఈ చిన్నారి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us