ఎయిర్‌క్రాఫ్ట్‌ని విజయవంతంగా ల్యాండ్‌ చేసిన అజిత్‌.. వీడియో వైరల్‌

కోలీవుడ్ నటుడు అజిత్‌ మల్టీటాలెంటెడ్‌ అన్న విషయం తెలిసిందే. బైక్‌, కారు రేసింగ్‌, ఏరో మోడలింగ్‌లో ఈ నటుడికి మంచి ప్రావీణ్యం ఉంది.

ఎయిర్‌క్రాఫ్ట్‌ని విజయవంతంగా ల్యాండ్‌ చేసిన అజిత్‌.. వీడియో వైరల్‌

Ajith skillfully lands aircraft: కోలీవుడ్ నటుడు అజిత్‌ మల్టీటాలెంటెడ్‌ అన్న విషయం తెలిసిందే. బైక్‌, కారు రేసింగ్‌, ఏరో మోడలింగ్‌లో ఈ నటుడికి మంచి ప్రావీణ్యం ఉంది. అంతేకాదు ఇటీవల అజిత్ నేతృత్వంలో ఐఐటీ మద్రాసులోని తక్ష అనే బృందం యూఏవీ డ్రోన్లను రూపొందించారు. ఈ డ్రోన్లు పలు పోటీల్లో బహుమతులు కూడా గెలుచుకున్నాయి. ఇక వీటిని మారుమూల ప్రదేశాలకు మెడిసిన్‌లను సరఫరా చేయడానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాదు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని కరోనా ప్రభావిత జోన్లలో శానిటైజ్ చేయడానికి కూడా ఈ డ్రోన్లను వినియోగిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అజిత్‌కి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ని విజయవంతంగా ల్యాండ్ చేశారు అజిత్‌. మధ్యలో సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పటికీ, తన స్కిల్‌తో దాన్ని ల్యాండ్ చేశారు. దీంతో టీమ్‌ ఆయనను అభినందించింది. కాగా అజిత్ ప్రస్తుతం వలమై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తుండగా.. యోగి బాబు, పర్నె మ్యాన్నీ, కార్తికేయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బోని కపూర్‌ నిర్మిస్తోన్న ఈ మూవీకి వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.

Read This Story Also: Breaking: నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

Click on your DTH Provider to Add TV9 Telugu