జోరు లేని సెప్టెంబర్‌..!! ‘గద్దలకొండ గణేష్ ఈజ్ ద కింగ్’

ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమాల జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. చాలా సినిమాలే రిలీజ్‌ అయినప్పటికీ.. పెద్దగా ఏ సినిమా.. పేరు సంపాదించలేదు. సెప్టెంబర్‌ నెలలో.. డబ్బింగ్ సినిమాలతో కలిసి మొత్తం 12కిపైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ.. వరుణ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ మాత్రమే బాక్స్‌ ఆఫీస్‌ను షేక్ చేసింది. సెప్టెంబర్ 2019లో మొదటి వారంలో ఏకంగా ఏడు సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. అంతకుముందే.. ఆగష్టు 30న రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ రిలీజ్‌ […]

జోరు లేని సెప్టెంబర్‌..!! 'గద్దలకొండ గణేష్ ఈజ్ ద కింగ్'
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 03, 2019 | 12:54 PM

ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమాల జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. చాలా సినిమాలే రిలీజ్‌ అయినప్పటికీ.. పెద్దగా ఏ సినిమా.. పేరు సంపాదించలేదు. సెప్టెంబర్‌ నెలలో.. డబ్బింగ్ సినిమాలతో కలిసి మొత్తం 12కిపైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ.. వరుణ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ మాత్రమే బాక్స్‌ ఆఫీస్‌ను షేక్ చేసింది.

సెప్టెంబర్ 2019లో మొదటి వారంలో ఏకంగా ఏడు సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. అంతకుముందే.. ఆగష్టు 30న రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ రిలీజ్‌ అయిన కారణంగా.. పెద్దగా చిత్రాలేవీ కనిపించలేదు. సాహో.. కలెక్షన్స్‌ పరంగా సక్సెస్‌ అయినా.. తెలుగులో మాత్రం ఫ్లాప్ టాక్‌‌ని సొంతం చేసుకుంది. ఆతరువాత.. సాయి కుమార్ జోడీ సినిమా, ఉండిపోరాదే, దర్పణం, 2 అవర్స్ లవ్, వీడే సైరైనోడు, నీ కోసం, తారామణి వంటి చిత్రాలన్నీ రిలజ్‌ అయ్యాయి. కానీ.. వీటన్నింటిలో చెప్పుకోదగ్గది.. సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ‘జోడి’ సినిమా. అది కూడా ఓల్డ్ నేరేషన్‌తో.. ఫ్లాప్‌టాక్‌ను సొంతం చేసుకుంది. మిగతా సినిమాలయితే.. ఎప్పుడు వచ్చాయో.. వెళ్లాయో కూడా తెలీదు.

Jodi Telugu Movie Review

ఇక రెండోవారంలో.. రిలీజ్‌ అయిన ‘నాని గ్యాంగ్ లీడర్’ సినిమా.. మంచి టాక్‌ను సొంతం చేసుకున్నా.. ఆశిచినంతగా అయితే.. బాక్సాఫీస్‌ ముందు నిలబడలేకపోయింది. కలెక్షన్ల విషయంలో గ్యాంగ్ లీడర్ చతికిలబడిపోయాడనే చెప్పాలి. ఇక సుదీప్ నటించిన ‘పహిల్వాన్’ సినిమాను పాన్ ఇండియాగా ప్రమోషన్ చేశారు. కానీ.. ఈ చిత్రం సగటు కన్నడ సినిమా కంటే.. దిగువస్థాయిలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. ఇక శ్రీకాంత్ విలన్‌గా నటించిన ‘మార్షల్’ కూడా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టులేకపోయింది.

మూడోవారంలో ‘గద్దలకొండ గణేష్’ వచ్చాడు.. లుక్‌తోనే ఫ్యాన్స్‌ అందరినీ తనవైపుకు తిప్పుకున్న వరుణ్.. బాక్సాఫీస్‌ను గజ.. గజ.. లాండించాడనే చెప్పాలి. మొదట.. ‘వాల్మీకి’గా ప్రచారాలు, ప్రమోషన్స్‌ చేసినా.. సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు టైటిల్ మార్చేశారు. వాల్మీకి టైటిల్‌కి వరుణ్ గెటప్‌కి సూట్ కాలేదని.. స్వయానా రామాయణం రాసిన వాల్మీకీనే.. కించపరిచనట్టుగా ఉందని.. రాజకీయంగా కూడా ఒత్తిడి రావటంతో.. రిలీజ్‌‌కి ముందు టైటిల్‌ను మార్చారు. టైటిల్‌ మార్పుతో.. సినిమాపై ఆందోళన పెంచుకున్న మూవీ యూనిట్‌కి.. అనుకోని విధంగా.. సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. హరీష్ శంకర్ మాస్ ఎలిమెంట్స్.. వరుణ్ న్యూ లుక్.. సినిమాకు భారీగా విజయంతో పాటు లాభాలను కూడా తెచ్చిపెట్టాయి.

నాలుగోవారంలో.. సూర్య హీరోగా.. ‘బందోబస్తు’ సినిమా రిలీజ్‌ అయినా.. అది కూడా ఆశించినంతగా ప్రేక్షకాధారణ పొందలేకపోయింది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు రుచించలేదని చెప్పవచ్చు. ఆ తరువాత వచ్చిన ‘నేను నాగార్జున’, ఆలీ ‘పండుగాడి స్టూడియో’ సినిమాలు డిజాస్టర్లుగా మారాయి.

Bandobast Movie Working stills

ఆ తరువాత.. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ రోల్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా విడుదలతో.. ఇక వేరే సినిమాలేవీ రాలేదు. మొత్తానికి.. ‘గద్దలకొండ గణేష్’ ఈజ్ కింగ్ ఇన్ సెప్టెంబర్ అని చెప్పవచ్చు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu