Sudigali Sudheer: ‘సుడిగాలి సుధీర్‌కు జబర్దస్త్‌లో అవమానం’.. అసలు విషయం చెప్పిన హైపర్ ఆది..
కిరాక్ ఆర్పీ కామెంట్స్ తోనే సుడిగాలి సుధీర్‌కు అవమానం అనే న్యూస్ బయటికి వచ్చింది. రీసెంట్గా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన కిర్రాక్ ఆర్పీ.. ఓ యూట్యూబ్ చానెల్లో బజర్దస్త్ షో పై,
జబర్దస్త్ అందర్నీ నవ్వించడమే కాదు.. ఎప్పుడూ వివాదాల్లో కూడా మునిగితేలుతుంటుంది. ఇక అందులోని కమెడియన్స్.. జోకుల పేరుతో వంకర మాటలు.. పంచ్‌ల పేరుతో విమర్శలు చేస్తారనే కామెంట్ కూడా ఉంది. వీటన్నింటికి తోడు.. సుడిగాలి సుధీర్ కు జబర్దస్ట్ అవమానం జరిగిందనే న్యూస్ కూడా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈన్యూస్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు కమెడియన్ హైపర్ ఆది అండ్ ఆటో రామ్ ప్రసాద్.
తాజాగాఓ ఇంటర్వ్యూలో ఈ న్యూస్ గురించి మాట్లాడిన వీరిద్దరూ … సుడిగాలి సుధీర్‌కు జబర్దస్త్‌లో అవమానమే జరగలేదని కొట్టిపారేశారు. సుధీర్ సినిమాల్లో బిజీ అవుతున్న క్రమంలో… కాంట్రాక్ట్ లాప్స్ అయిన నేపథ్యంలోనే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారన్నారు. అయితే కిరాక్ ఆర్పీ అలా ఎందుకు మాట్లాడారో తమకు తెలియదని చెప్పారు ఈ బుల్లితెర కామెడీ స్టార్స్.
ఇక కిరాక్ ఆర్పీ కామెంట్స్ తోనే సుడిగాలి సుధీర్‌కు అవమానం అనే న్యూస్ బయటికి వచ్చింది. రీసెంట్గా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన కిర్రాక్ ఆర్పీ.. ఓ యూట్యూబ్ చానెల్లో బజర్దస్త్ షో పై, ప్రొడ్యూసర్స్ మల్లెమాల యాజమాన్యం పై తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లెమాల యాజమాన్యం తమతో ఆడుకున్నారని.. కనీసం నాణ్యమైన తిండి కూడా పెట్టలేదని.. ఆరోపించారు. ఈ క్రమంలోనే సుధీర్‌ను దారుణంగా అవమానించారంటూ.. రివీల్ చేశారు ఆర్పీ. అయితే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ మాటలు ఆర్పీ మాటలకు భిన్నంగా ఉండడం.. సుధీర్ కాకుండా వీరు క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట కొత్త చర్చ పుట్టుకొచ్చేలా చేస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.