మహేశ్ సినిమాలో ఇద్దరు సీనియర్ స్టార్లు..?
యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ 26వ చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. నటీనటులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు. అందులో భాగంగా హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరు వినిపిస్తుండగా.. కీలక పాత్రలలో మరో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర, లేడి అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ ఇద్దరితో […]

యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ 26వ చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. నటీనటులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు. అందులో భాగంగా హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరు వినిపిస్తుండగా.. కీలక పాత్రలలో మరో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర, లేడి అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ ఇద్దరితో సంప్రదింపులు పూర్తైనట్లు టాక్. అయితే కృష్ణ, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’లో మహేశ్ కీలక పాత్రలో కనిపించగా.. ఇప్పుడు మహేశ్ చిత్రంలో కీలకపాత్రలో నటించేందుకు విజయశాంతి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు మహర్షిలో నటిస్తుండగా.. మే9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.