మహేశ్‌కు నో చెప్పిన స్టార్ హీరో..?
మహేశ్ 26వ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇందులో విలన్ పాత్ర కోసం కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్రను దర్శకుడు అనిల్ రావిపూడి సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇందులో నటించేందుకు ఉపేంద్ర నో చెప్పాడట. రాజకీయాల్లో రాణించాలనుకుంటోన్న ఉపేంద్ర సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. అందుకే మహేశ్ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికతో సంప్రదింపులు జరపగా.. ఆమె ఓకే చెప్పిందన్న వార్తలు వినిపిస్తున్నాయి […]

మహేశ్ 26వ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇందులో విలన్ పాత్ర కోసం కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్రను దర్శకుడు అనిల్ రావిపూడి సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇందులో నటించేందుకు ఉపేంద్ర నో చెప్పాడట. రాజకీయాల్లో రాణించాలనుకుంటోన్న ఉపేంద్ర సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. అందుకే మహేశ్ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికతో సంప్రదింపులు జరపగా.. ఆమె ఓకే చెప్పిందన్న వార్తలు వినిపిస్తున్నాయి . అలాగే ఈ మూవీలో లేడి అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.